Anand Mahindra: భారతదేశంలో అత్యంత ప్రభావితమైన పారిశ్రామికవేత్తలలో ఒకరైన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరై తన పర్యటన అనుభవాలను పంచుకున్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ‘విజన్ 2047’ ప్రణాళికపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సంభాషించే గొప్ప అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టంగా ఆయన భావించారు. అయితే, ఈ అధికారిక పర్యటనలో ఆనంద్ మహీంద్రా కి ఒక ఊహించని పరిణామం ఎదురైంది. తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవిని ఆయన అనుకోకుండా కలుసుకున్నారు. మెగాస్టార్ తో మాట్లాడినంతసేపు తను ఎలా ఫీల్ అయ్యారో ట్విటర్ వేదికగా రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆనంద్ మహీంద్రా చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని పొగడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చిరంజీవి కేవలం సినీ ప్రపంచానికే కాక, యావత్ దేశానికి తెలిసిన ఒక లెజెండ్ అని ఆయన కొనియాడారు. కానీ, ఆయనను నిజంగా అభిమానించదగిన వ్యక్తిగా మార్చేది ఆయనలోని రెండు అపురూపమైన లక్షణాలని ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆయనలోని వినయం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ఒక అగ్రశ్రేణి వ్యక్తిగా ఉండి కూడా, ఆయనను ప్రియమైన వ్యక్తిగా మార్చాయి” అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.
Read also-Bigg Boss Telugu9: భరణి వల్ల సుమన్ శెట్టికి అన్యాయం!.. కళ్యాణ్ అదంతా కావాలనే చేశాడా?..
ఈ అరుదైన కలయిక ఆనంద్ మహీంద్రా జీవితంలో అపురూపమైన దృష్యంగా ఉండిపోతుంది. అదేమిటంటే… నేర్చుకోవాలనే తృష్ణ (జిజ్ఞాస) వినయంతో కూడిన వినే తత్వం.. ఈ రెండు లక్షణాలే ఏ రంగంలోనైనా, అది సినిమా రంగమైనా, వ్యాపార సామ్రాజ్యమైనా లేక ప్రభుత్వ పాలసీల రూపకల్పన అయినా, స్థిరమైన, శాశ్వతమైన విజయానికి పునాదులని ఆయన దృఢంగా చెప్పారు. ఒకవైపు దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మరోవైపు సినీ జగత్తులో అగ్రస్థానం పొందిన మహానటుడు.. ఈ ఇద్దరి భేటీ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. వినయం, నేర్చుకోవాలనే తపన ఉన్న వ్యక్తి మాత్రమే తన ఉన్నత స్థానంలో కూడా ఎదగడానికి సిద్ధంగా ఉంటారని, ఆనంద్ మహీంద్రా మాటలు నిరూపించాయి. ఈ స్ఫూర్తిదాయకమైన సందేశం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప మార్గదర్శకంగా ఉంటుంది. దీనిని చూసిన మెగాస్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
I was in Hyderabad yesterday to address the Telangana Rising Global Summit.
Apart from the privilege of interacting with Chief Minister Revanth Reddy Garu, on the subject of the Vision 2047 plan for the state, it was an unexpected surprise to be able to finally meet Megastar… pic.twitter.com/m9vJoXXbM5
— anand mahindra (@anandmahindra) December 10, 2025

