Bigg Boss Telugu9: బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 చివరి గడియలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ఫైనలిస్ట్ అవ్వడానికి సభ్యలు తమ సర్వస్వం వడ్డుతున్నారు. తాజాగా 94 రోజుకు సంబంధించి మొదటి ప్రోమో విడుదలైంది. అందులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడానికి సభ్యలు పోరాడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి, ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా.. లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న మూడవ యుద్ధం పట్టుకో పట్టుకో అనే టాస్కును బిగ్ బాస్ సభ్యలకు ఇచ్చింది. పవన్, సంజనాలు సంచాలకులు గా ఉంటారు. వారు కొన్ని బంతులను విసురుతుంటే పెద్ద సంచిలాంటి ప్రాంట్ కలిగిన సభ్యలు ఆ బంతులను పట్టుకోవాలి. ఎవరు అయితే ఎక్కువ బంతులకు పట్టుకుంటారో వారు ఈ గేమ్ లో నెగ్గినట్టు. వారు స్కోర్ బోర్డులో లీడింగ్ లో ఉంటారు.
Read also-Aadarsha Kutumbam: వెంకీ మామ, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఇదే.. మొదలైన ఫైరింగ్..
ఫైనలిస్ట్ అయ్యే సభ్యలు జంబో ప్యాంట్స్ థరించి సంచాలకులు విసిరిన బంతులను పట్టుకోవాలి. ఎవరు అయితే ఎక్కువ బంతులను సేకరిస్తారో వారు ఎక్కువ స్కోర్ సాధించి టీడింగ్ బోర్డులో ముందు ఉంటారు. అందరూ సిద్ధం అయ్యారు గేమ్ ఆడటానికి. కళ్యాణ్ బంతులు విసురు తుంటో అక్కడ ఉన్న వారు పట్టుకుంటున్నారు. అందులో ఎక్కువగా ఇమ్మానియేల్ భరణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ ఎన్నో కొన్ని సాధించారు. అయతే సుమన్ శెట్టి మాత్రం చాలా తక్కువ సేకరించారు. ఎందుకంటే పక్కన భరణి ఉన్నాడు. హైట్ ఎడ్వాన్ టేజ్ తీసుకుని వచ్చిన ప్రతి బంతిని పట్టుకొవడానికి ప్రయత్నించారు. అలాగే పట్టుకున్నాడు కూడా. అయతే సుమన్ శెట్టి వైపుకు వస్తున్న బంతులను భరణి పట్టుకున్నాడు, దీనికి సుమన్ భరణిపై ఫైర్ అయ్యాడు. ఎందుకు అన్నా నా వైపు వస్తున్న బంతులను పట్టుకోవడానికి వస్తున్నావు. అవి నా కోసం వేసినవి కదా… అంటూ అనడంతో భరణి అది నీ హైట్ అడ్వాంటేజ్ ఉపయోగించుకున్నా అని సమాధానం ఇచ్చాడు.
Read also-Saik Siddharth: నందు ‘సైక్ సిద్ధార్థ’ రిలీజ్ డేట్ వాయిదా.. వచ్చేది ఎప్పుడంటే?
ఆ తర్వాత సుమన్ శెట్టి కి వేయవచ్చుకదా.. అని సంజనా కళ్యాణ్ ను అడగ్గా నేను ఆయనకు వేశాను కానీ భరణి గారు పట్టుకున్నారు. దనాకి నేనేం చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత కళ్యాణ్ భరణి ల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. చివరికి తనూజ చెప్పింది తూచా తప్పకుండా వింటున్నాడని కళ్యాణ్ పై భరణి ఆరోపించారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సాయంత్రం వరకూ వేచి ఉండాల్సిందే..

