Akhanda 2 Thaandavam: బాలయ్య ఫ్యాన్స్ కు ఏపీ గుడ్ న్యూస్..
balayya-babu(image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 Thaandavam: బాలయ్య అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి..

Akhanda 2 Thaandavam: నందమూరి అభిమానులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు ఎంతగానో వెసులుబాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) నట తాండవానికి ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచుకునే వెసులు బాటు కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రం ‘అఖండ2: తాండవం’ (Akhanda2: Thaandavam)పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడి, ప్రస్తుతం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా, ఈ సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్ల ధరల పెంపుతో పాటు, ఒక రోజు ముందు ప్రీమియర్‌కు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది.

Read also-Nari Nari Naduma Murari: సంక్రాంతి బరిలో దిగిన శర్వానంద్.. ‘బైకర్’తో మాత్రం కాదు..

పెరిగిన టికెట్ల ధరల వివరాలివే..

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం టికెట్ ధరలు ఎంత పెరిగాయంటే.. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధరపై రూ. 75, మల్లీప్లెక్స్‌లో రూ. 100 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోజుకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ.. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. ఇక ప్రీమియర్ విషయానికి వస్తే.. ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్‌కు అనుమతి ఇస్తూ.. ప్రీమియర్ టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మధ్య బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ అయితే కొడుతున్నారు కానీ, కలెక్షన్ల పరంగా సరైన రికార్డ్ మాత్రం ఆయన అకౌంట్‌లో లేదు.

Read also-Saik Siddharth: నందు ‘సైక్ సిద్ధార్థ’ రిలీజ్ డేట్ వాయిదా.. వచ్చేది ఎప్పుడంటే?

కాలర్ ఎగరేసి మరీ

ఇప్పుడొస్తున్న ‘అఖండ 2: తాండవం’ పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుండటం, ఏపీలో ప్రీమియర్‌కు అనుమతి, టికెట్ల ధరల పెంపు వంటి వన్నీ కలిసొచ్చాయి కాబట్టి.. ఈసారి కలెక్షన్ల పరంగానూ బాలయ్య రికార్డు కొట్టబోతున్నారని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. చూద్దాం మరి బాలయ్య బాక్సాఫీస్‌పై చేసే తాండవం ఎలా ఉండబోతుందో? మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నటసింహం బిడ్డ తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక బాలయ్య తాండవం ఎలా ఉంటుందో తెలియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. నందమూరి అభిమానులకు ఈ సమయం చాలా కష్టంగా గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదేమో.. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేశాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రావాల్సి ఉంది. అది కూడా ఈ సాయంత్రంలోపు జీవో వస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క