HMDA Former Director Shiva Balakrishna New Scam
సూపర్ ఎక్స్‌క్లూజివ్

HMDA New Scam : అవినీతి అనకొండ.. టీడీఆర్ స్కాంలోనూ శివబాలకృష్ణ లీలలు

– కృష్ణకుమార్‌తో కలిసి దందా
– టీడీఆర్ స్కామ్‌కు శ్రీకారం
– ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల నష్టం
– టీడీఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజులు వసూలు
– బడా బిల్డర్లకు లబ్ధి చేకూర్చేలా ఫైల్స్ క్లియర్
– శివబాలకృష్ణ అరెస్టుతో అమెరికా చెక్కేసిన కృష్ణ కుమార్


HMDA Former Director Shiva Balakrishna New Scam : అక్రమార్కుడు, అవినీతి అనకొండ, ఇలా హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే అరెస్ట్ అయిన ఇతని లీలలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. హెచ్ఎండీఏలో ఏ ఫైల్ కదిపినా శివబాలకృష్ణ హస్తం కనిపిస్తోంది. మొన్నటిదాకా అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన

బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేలకోట్ల నష్టం చేకూర్చినట్లు తెలుస్తోంది. బిల్డర్లకు లాభం చేకూర్చేలా ఫైల్స్ క్లియర్ చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. కృష్ణ కుమార్ చర్యల వల్ల ప్రభుత్వానికి కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శివబాలకృష్ణ అరెస్ట్ కాగానే కృష్ణ కుమార్ అమెరికా చెక్కేసినట్టు గుర్తించారు.


ఇప్పటికే కృష్ణ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనను అమెరికా నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణ కుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల పాత్రపై ఆరా తీస్తున్నారు. వీరు బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్‌లో టీడీఆర్ విలువ తగ్గించి, తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని ఏసీబీ చెబుతోంది.

గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో శివ బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. విచారణలో వందల కోట్ల అక్రమస్తులు బయటపడ్డాయి. బినామీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు అధికారులు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!