Neelambari Sequel: రజనీకాంత్ కెరీర్‌లో 1999లో విడుదలైన ‘నరసింహ’ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, రజనీకాంత్ స్టైల్, యాక్షన్, అలాగే రమ్యకృష్ణ పోషించిన ప్రతి నాయక పాత్ర నీలాంబరికి ఉన్న క్రేజ్ అపారమైనది. నీలాంబరి పాత్ర కేవలం విలన్ పాత్రగానే కాకుండా, హీరోయిజానికి సమానమైన స్థాయిలో పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ గా నిలిచింది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. తాజాగా, రజనీకాంత్ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నీలాంబరి’ అనే పేరుతో సినిమాను ప్రకటించారు. ఈ సీక్వెల్ ప్రకటన అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. నీలాంబరి పాత్ర మరణంతో ముగిసినా, ఆమె పేరుతో సీక్వెల్ రావడం అనేది ఆ పాత్ర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ సీక్వెల్ కథాంశంపై ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియకపోయినా, ఈ పాత్ర చుట్టూ కథ అల్లుకుని ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీక్వెల్ ప్రకటించడంతో, రమ్యకృష్ణ ఈ పాత్రను తిరిగి పోషిస్తారా అనే చర్చ కూడా మొదలైంది.
Read also-Mandhana Post: స్మృతి మంధాన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ‘ప్రశాంతత అనేది నిశ్శబ్దం కాదు’..
నీలాంబరి పాత్రకు మొదట ఎవరంటే?
సీక్వెల్ ప్రకటన సందర్భంగా రజనీకాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర కోసం మొదట చిత్ర బృందం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ను సంప్రదించిందట మూవీ టీం. “నీలాంబరి పాత్రను దృష్టిలో పెట్టుకుని మేము మొదట ఐశ్వర్య రాయ్ ని సంప్రదించాము. అయితే, ఆమె ఆ పాత్రను పోషించడానికి ఒప్పుకోలేదు. ఆమె విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపలేకపోయారు,” అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
ఐశ్వర్య రాయ్ నిరాకరించడంతో, ఆ పాత్రలోకి రమ్యకృష్ణ అడుగుపెట్టారు. రమ్యకృష్ణ అద్భుతమైన నటన, హావభావాలు, గ్రేస్‌తో నీలాంబరి పాత్రను ఒక ఐకానిక్ పాత్రగా మలిచారు. పడయప్ప (నరసింహ) క్యారెక్టర్‌కు ధీటుగా, రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. ఆమె పర్ఫార్మెన్స్ లేకుండా ‘నరసింహ’ సినిమాను ఊహించలేము. ఈ పాత్ర రమ్యకృష్ణ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. రజనీకాంత్ గారు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, అభిమానులు ప్రేక్షకులు, ఐశ్వర్య రాయ్ నిరాకరించడం వల్లే అంతటి అద్భుతమైన పాత్రను రమ్యకృష్ణ పోషించగలిగారని, ఇది కచ్చితంగా ఆ పాత్రకు ఆమెకు కలిగిన అదృష్టమని అభిప్రాయపడుతున్నారు. రమ్యకృష్ణ నీలాంబరి పాత్రకు జీవం పోసి, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు.
Read also-Om Shanti Shanti Shantihi Teaser: తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బాల మూవీ టీజర్ ఎలా ఉందంటే.. పక్కా హిట్!
‘నరసింహ’ సినిమా తెలుగు, తమిళ సినీ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు, ఈ సినిమాకు ‘నీలాంబరి’ పేరుతో సీక్వెల్ రావడం, రజనీకాంత్ గారు నీలాంబరి పాత్ర వెనుక ఉన్న ఐశ్వర్య రాయ్ కథను వెల్లడించడం ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచింది. రాబోయే ‘నీలాంబరి’ సినిమా పాత సినిమా స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

