Om Shanti Shanti Shantihi Teaser: టీజర్ ఎలా ఉందంటే..
Om Shanti Shanti Shantihi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Om Shanti Shanti Shantihi Teaser: తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బాల మూవీ టీజర్ ఎలా ఉందంటే.. పక్కా హిట్!

Om Shanti Shanti Shantihi Teaser: ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో AR సజీవ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ‌గా ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తై, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసి, చిత్ర ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఈ టీజర్‌ (Om Shanti Shanti Shantihi Teaser)ను గమనిస్తే..

Also Read- Jr NTR: చిరు బాటలో జూనియర్ ఎన్టీఆర్.. అనుమతి లేకుండా పేరు, ఫొటో వాడకూడదంటూ..!

ఐపిఎల్ సంభాషణ హైలెట్

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లో కథ అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుందనేది అర్థమవుతోంది. అతను.. ఓర్పు, అన్నీ సర్దుకు రాగల మంచి క్రమశిక్షణ కలిగిన మహిళ కొండవీటి ప్రశాంతిని వివాహం చేసుకుంటాడు. వారి విభిన్న వ్యక్తిత్వాలతో నడిచే ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. అంతేకాదు, ఇందులో ఊహించని మలుపు ఉన్నట్లుగా కూడా టీజర్ క్లారిటీ ఇస్తోంది. దర్శకుడు ఎఆర్ సజీవ్ దీనిని భిన్నమైన, ఆహ్లాదకరమైన, అలాగే ఆరోగ్యకరమైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారనేది టీజర్ తెలియజేస్తుంది. రైటింగ్, కథనం, సినిమాటోగ్రఫీ, సంగీతం, నిర్మాణ విలువలు అన్నీ కూడా ఈ విలేజ్ డ్రామాగా ఏ మోతాదులో కావాలో ఆ స్థాయిలోనే ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తన సహజ నటనతో కట్టిపడేయగా, ఐపిఎల్ సంభాషణ తన పాత్రని హైలైట్ చేసే హ్యూమరస్ బిట్‌గా నిలుస్తుంది. ఈషా రెబ్బా తన పాత్రలో ఒదిగిపోయింది. టీజర్ ప్రామెసింగ్ వుంది. లాంగ్ వీకెండ్‌ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్‌లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ టీజర్‌తో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Bigg Boss Telugu 9: సంజన జైలుకి, తాత్కాలిక కెప్టెన్‌గా భరణి.. నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?

రీమేక్ కదా అని అనుకునే వారి కోసం..

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా ప్యాషనేట్ ప్రాజెక్టు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుందని అంటుంటారు. నాకు అలాంటి అవకాశం ఇచ్చిన నిర్మాత సృజన్, డైరెక్టర్ సజీవ్, ఇంకా టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాలో బ్రహ్మాజీకి చాలా మంచి పేరు వస్తుంది. ఆయన వచ్చినప్పుడు అందరూ విజిల్స్, క్లాప్స్‌తో హోరెత్తిస్తారు. చాలామందికి ఇది రీమేక్ కదా మళ్లీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. దానికి రీజన్ చెబుతా.. ‘విజయ్ సుపెరుం పౌర్ణమియుం’ మలయాళంలో వంద రోజులు ఆడిన సినిమా. మలయాళం ప్రేక్షకులు సినిమాని చాలా ఆదరించారు. అది ‘పెళ్లిచూపులు’ రీమేక్‌గా తెరకెక్కింది. గోదారి యాస, కల్చర్‌కి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా రీసెంట్ టైంలో ఇదే అవుతుందని గ్యారెంటీగా చెప్తున్నాను. ఇందులో కూడా అందరికీ నిజాయితీ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మంచి ప్యాషన్‌తో చేశాను. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసినప్పుడు అందరికీ ఆ విషయం తెలుస్తుందని అన్నారు. హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్‌తో నటించే అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీ. ఆయన డైరెక్షన్లో కూడా నటించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను. సజీవ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం