Akhil Project: అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరీర్‌లో సరైన బ్లాక్ బస్టర్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత కష్టపడినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో, అఖిల్ తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్, అనిల్ కుమార్ దర్శకత్వంలో ‘లెనిన్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే, అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక భారీ స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Read also-Aamir Love: అరవై ఏళ్ల వయసులో తనకు ప్రేమ దొరకడంపై ఆమిర్ ఖాన్ సంచలన కామెంట్స్..
ప్రశాంత్ నీల్ అసోసియేట్‌తో చర్చలు? పాన్ ఇండియా డైరెక్టర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ సృష్టికర్త ప్రశాంత్ నీల్ కాంపౌండ్ నుంచి అఖిల్ తదుపరి సినిమా ఉండబోతోందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఒక అసోసియేట్ డైరెక్టర్ చెప్పిన కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేవలం నీల్ శిష్యుడి దర్శకత్వంలోనే కాకుండా, స్వయంగా ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలో కూడా జరగనుందని టాక్. సుకుమార్ తన శిష్యుల సినిమాలకు (ఉప్పెన, విరూపాక్ష) కథ, స్క్రీన్ ప్లే సహకారం అందించినట్టే, ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా విషయంలో తన మార్క్ చూపించబోతున్నారట.
Read also-Annagaru Vastaaru Trailer: కార్తి ‘అన్నగారు వస్తారు’ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది చూశారా..
జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కీలక భేటీ! ఈ వార్తలకు బలం చేకూర్చే సంఘటన ఇటీవల జరిగింది. కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో ఒక ప్రైవేట్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో పాటు ప్రశాంత్ నీల్, అఖిల్ కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమా చర్చలతో పాటు, అఖిల్ ప్రాజెక్ట్ గురించి కూడా అక్కడ చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఖిల్, ప్రశాంత్ నీల్ మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఈ మీటింగ్ ఒక వేదికగా నిలిచింది. అక్కినేని అభిమానులకు పండగే.. ఒకవేళ ఈ వార్త నిజమైతే, అక్కినేని అభిమానులకు అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు. అఖిల్ బాడీ లాంగ్వేజ్‌కు, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, హై-వోల్టేజ్ యాక్షన్ తోడైతే సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ‘లెనిన్’ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌ని, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో మాస్ ఆడియన్స్‌ని మెప్పించాలని అఖిల్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఇవి కేవలం చర్చల దశలోనే ఉన్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా, అఖిల్ ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

