iBomma Ravi: ఐ బొమ్మ రవిపై ‘అఖండ 2’ నిర్మాతలు రియాక్షన్ ఇదే
akhanda2-prodicers(X)
ఎంటర్‌టైన్‌మెంట్

iBomma Ravi: ‘ఐ బొమ్మ’ రవి గురించి ‘అఖండ 2’ నిర్మాతలు ఏం అన్నారంటే?.. ఇది ఊహించి ఉండరు..

iBomma Ravi: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా, సినిమా నిర్మాతలు, ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, సినీ పరిశ్రమకు పెను సవాల్ విసురుతున్న పైరసీ ప్లాట్‌ఫామ్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు రవి అలియాస్ ఐ బొమ్మ రవి వ్యవహారంపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read also-IBomma Ravi: ‘ఐ బొమ్మ’ రవికి జాబ్ ఆఫర్ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చిన సైబర్ క్రైమ్ డీసీపీ..

రాబిన్ హుడ్‌తో పోలికపై అభ్యంతరం

ఐబొమ్మ రవిని కొందరు ప్రేక్షకులు ‘రాబిన్ హుడ్’గా అభివర్ణిస్తున్నారని యాంకర్ ప్రస్తావించగా, నిర్మాతలు ఆచంట సోదరులు ఈ పోలికపై గట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. “వాడు రాబిన్ హుడ్ ఎలా అవుతాడు?” అంటూ ప్రశ్నించారు. అసలైన రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వారు వివరించారు. “రాబిన్ హుడ్ అంటే ఉన్న వారి దగ్గర దోచుకుని లేని వారికి పంచిపెట్టాలి. అలా అనుకుంటే, సంవత్సరానికి విడుదలయ్యే సినిమాల్లో దాదాపు 90 శాతం చిన్న సినిమాలే ఉంటాయి. 10 శాతం మాత్రమే పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. నిజంగా రాబిన్ హుడ్ అయితే, ఆ పది శాతం పెద్ద సినిమాలను మాత్రమే వాడు ప్రేక్షకులకు అందించాలి. కానీ, వాడు ఆ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలను అక్రమంగా ప్రేక్షకులకు అందిస్తున్నాడు. అలాంటి వాడు రాబిన్ హుడ్ ఎలా అవుతాడు?” అని రామ్ ఆచంట, గోపీ ఆచంట ఫైర్ అయ్యారు.

పరిశ్రమకు కోలుకోలేని నష్టం

నిర్మాతల ఈ వ్యాఖ్యలు కేవలం ఒకరిపై వ్యక్తిగత దాడి కాదు, పైరసీ కారణంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పును, ఆర్థిక నష్టాన్ని ఎత్తిచూపే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సినిమా విడుదలకు వందల కోట్ల పెట్టుబడులు, వేలాది మంది శ్రమ, కొన్ని నెలల పాటు పడే కష్టం ఇమిడి ఉంటాయి. పైరసీ ప్లాట్‌ఫామ్‌లు విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాను ఆన్‌లైన్‌లో ఉంచడం వల్ల, థియేటర్లకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోతుంది. ఇది కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాదు, తక్కువ బడ్జెట్‌తో నిర్మితమయ్యే చిన్న సినిమాలకు కూడా మనుగడ కష్టంగా మారుస్తోంది.

Read also-Pushpa Journey: ‘పుష్ప’ ఐదేళ్ల విజయ ప్రస్థానం గుర్తు చేసుకుంటూ బన్నీ ఎమోషనల్ నోట్..

ఒకవేళ, ఐబొమ్మ రవిపై ప్రేక్షకులు పెట్టిన ‘రాబిన్ హుడ్’ ట్యాగ్ సరైనదే అయితే, అతను కేవలం పెద్ద బడ్జెట్ సినిమాలు, భారీ లాభాలు ఆర్జించే చిత్రాలను మాత్రమే ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. కానీ, వాస్తవానికి ప్రతి సినిమానూ పైరసీ చేయడం వల్ల, చిన్న నిర్మాతలు, చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విధంగా చూసినప్పుడు, ఐబొమ్మ రవి చర్యలు ‘రాబిన్ హుడ్’ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయనేది నిర్మాతల వాదన. మొత్తం మీద, ‘అఖండ 2’ ప్రమోషన్ల సందర్భంగా నిర్మాతలు చేసిన ఈ పదునైన వ్యాఖ్యలు, పైరసీపై సినీ పరిశ్రమ ఎంతటి ఆందోళనతో ఉందో మరోసారి స్పష్టం చేశాయి. ఈ సమస్యకు ప్రభుత్వాల నుంచి, చట్టపరమైన సంస్థల నుంచి గట్టి పరిష్కారం లభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖండ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. విడుదల తేదీ గురించి నిర్మాతలు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!