Panchayat Elections: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. తొలి విడత 4236 గ్రామపంచాయతీలు, 37440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే సర్పంచ్ స్థానాలకు 22,330 మంది, వార్డులకు 85,428 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 3న నామినేషన్ల విత్ డ్రా జరిగింది. సర్పంచ్ స్థానాలకు 8095 మంది, వార్డులకు 9626 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు రాత్రి ప్రకటించారు.
Also Read: Panchayat Elections: ఏకగ్రీవాల వైపు అడుగులేస్తున్న గ్రామాలు.. పార్టీలకు అతీతంగా పాలకవర్గం ఎంపిక!
13,127 మంది అభ్యర్థులు బరిలో
తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 5 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనుండగా మొత్తం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 149 వార్డులకు నామినేషన్లు రాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా వార్డులకు 67,893 మంది బరిలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో 318 పంచాయతీలకు 988 మంది, ములుగు జిల్లాలో 48 పంచాతీయలకు 145 మంది బరిలో నిలిచారు. వీరు తమ అదృష్టాన్ని, ప్రజల ఆశీర్వాదాన్ని పరీక్షించుకోనున్నారు.
Also Read: Panchayat Elections: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి.. ఏకగ్రీవాల కోసం వేలంపాటలు
రెండో విడత తేలిన నామినేషన్
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా భారీగా నామినేషన్లు నమోదు అయ్యాయి. 4332 గ్రామపంచాయతీలకు గాను నాలుగు గ్రామాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 4328 గ్రామపంచాయతీలకు 21032 మంది నామినేషన్లు వేశారు. అదేవిధంగా 38342 వార్డులకు గాను 88 వార్డులకు ఒక నామినేషన్ దాఖలు కాలేదని అధికారులు ప్రకటించారు. 38253 వార్డులకు గాను : 88951 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. 282 గ్రామపంచాయతీలకు గాను రెండు గ్రామపంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 250 గ్రామపంచాయతీలకు 1573 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 52 గ్రామపంచాయతీలకు గాను 244 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

