Breaking News: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాకు సంబంధించి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 4) షెడ్యూల్ చేయబడిన అన్ని ప్రీమియర్ షోలు రద్దు అయినట్లుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, దీనికి గల అసలు కారణం ‘టెక్నికల్ ఇష్యూ’ అని వారు చెబుతున్నా, రూ. 28 కోట్ల ఆర్థిక వివాదం కారణంగా కోర్టు ఇచ్చిన స్టే (Stay) అని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read- Sritej Health: ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.. అల్లు అర్జున్ తీరుపై శ్రీతేజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
నిర్మాతల అధికారిక ప్రకటన
సినిమా ప్రీమియర్‌లు రద్దు అయిన విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతలు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్‌లను రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విషయాలు తమ నియంత్రణలో లేవని నిర్మాతలు తమ అసహాయతను వ్యక్తం చేస్తూ, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నిర్మాతలు టెక్నికల్ ఇష్యూలను కారణంగా చూపిస్తున్నప్పటికీ, తెర వెనుక అసలు సమస్య వేరే ఉందని స్పష్టమవుతోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు పాత సినిమాల పంపిణీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిమిత్తం ‘అఖండ 2’ నిర్మాతలు సుమారు రూ. 28 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల విషయంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా, ఈరోస్ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు, బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదలకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోకుండా బ్రేక్ విధించిందని తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల కారణంగానే, ప్రీమియర్ షోలను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ రకమైన లీగల్ సమస్యలను దాటవేయడానికి సినీ పరిశ్రమలో ‘సాంకేతిక సమస్యలు’ అనే కారణాన్ని చెప్పడం సర్వసాధారణం.
అభిమానుల్లో నిరాశ
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 600 టికెట్ రేటుతో రాత్రి 8 గంటల షోకు అనుమతి ఇచ్చినా, చివరి నిమిషంలో ఈ విధంగా ప్రీమియర్‌లు రద్దవడం బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనా, లేదంటే ఏపీ, బెంగళూరు వంటి చోట్ల కూడానా? అనేది మాత్రం వారు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే, ఏపీలో ప్రీమియర్స్ షోలకు సంబంధించి ఆల్రెడీ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఆలస్యంగా జీవో పాస్ చేయడంతో.. ప్రీమియర్ షోలకు సంబంధించి ఇంకా టికెట్స్ బుక్ కాలేదు. తాజాగా వారు సవరించిన ట్వీట్ గమనిస్తే.. ఇండియా మొత్తం ఈ ప్రీమియర్స్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో మాత్రం ప్రీమియర్స్ పడుతున్నట్లుగా చెప్పారు. నిర్మాతలు చేసిన ఈ పోస్ట్‌తో అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ ట్వీట్‌కు అభిమానులు బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతమున్న వివాదం పరిష్కారమయ్యే వరకు ‘అఖండ 2’ సినిమా ప్రపంచవ్యాప్త విడుదలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. రూ. 28 కోట్ల బకాయిలను వెంటనే పరిష్కరించి, కోర్టు స్టేను ఎత్తివేయించుకుంటేనే సినిమా సజావుగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై నిర్మాతలు త్వరగా స్పందించి, సమస్యను పరిష్కరించాలని సినీ వర్గాలు, అభిమానులు కోరుతున్నారు.
#Akhanda2 Premieres in India scheduled for today are cancelled due to technical issues.
We’ve tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.
The overseas premieres will play as per the schedule today.
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
