MP Chamala: తెలంగాణ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్ సభలో మాట్లాడారు. 2010 ఆగస్టు 23కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా టెట్ పరీక్ష (TET)ను తప్పనిసరి చేయడం వల్ల లక్షలాది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. దీని వల్ల ఉపాధ్యాయులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని చెప్పుకొచ్చారు.
టెట్ ను తప్పనిసరి చేయడం వల్ల వేలాది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్ సంక్షోభంలో పడుతుందని లోక్ సభ దృష్టికి ఎంపీ చామల తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడటానికి కేంద్రం తక్షణమే తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే RTE Act 2009, NCTE Act 1993 చట్టాలలో తగిన సవరణలు చేయాలని పార్లమెంటు వేదికగా డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలను లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
TET పరీక్షను తప్పనిసరి చేయడం వల్ల లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని వెల్లడి
వేలాది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్ సంక్షోభంలో పడుతుందన్న చామల
నియమితులైన ఉపాధ్యాయుల హక్కులను రక్షించడానికి… pic.twitter.com/CjradXjPcR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 4, 2025
ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగం నుంచి రిటైర్ కావాలని ఈ ఏడాది సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయిదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ కావాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో 2010 ఆగస్టు 23కు ముందు దేశవ్యాప్తంగా నియామకమైన ఉపాధ్యాయుల్లో దాదాపు 25 లక్షల మంది టీచర్ల ఉద్యోగాలకు టెట్ ముప్పు పొంచి ఉంది.
Also Read: Viral Video: రసగుల్లా రచ్చ.. పీటలపై ఆగిన పెళ్లి, గాల్లోకి ఎగిరిన కుర్చీలు, బల్లలు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో విడుదల చేసిన టెట్ జీవో 51, తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో విడుదల చేసిన టెట్ జీవో 36 ప్రకారం, 23 ఆగస్ట్ 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయించినట్లు స్పష్టంగా పేర్కొంది. టెట్ రాయడానికి వయోపరిమితి 18 – 44 ఏళ్లుగా నిర్ణయించింది. అందుకే 2010 నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు మరొక పోస్టు కోసం ప్రత్యక్ష నియామకం ద్వారా డీఎస్సీ/ టీఆర్టీ రాయాలనుకున్నవారు మినహా ఎవరూ గత 15 ఏళ్లుగా టెట్ రాయాలనే ఆలోచనే చేయలేదు.
