Moglie Trailer: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచింది. జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను నేషనల్ క్రష్ రష్మికా మందానా విడుదల చేశారు. ‘మోగ్లీ 2025’ సినిమా ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అడవి నేపథ్యంతో రూపొందించారు.
Read also-Naga Vamsi: సినిమాలకు సింపతీ కార్డ్ ఎందుకు పనిచేయడంలేదు.. నాగవంశీ ఏం అన్నారంటే?
ట్రైలర్ చూస్తుంటే, ఇందులో ప్రేమ, సంఘర్షణ, భావోద్వేగాలు మేళవించినట్టు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రాజ్ ఈ కథను రామాయణంలోని పాత్రల ఛాయలతో ఆధునిక నేపథ్యంలో రూపొందించినట్లు ఇటీవల వెల్లడించారు. ఈ కథలో హీరో రోషన్ కనకాల పాత్ర ‘రాముడి’ని పోలి ఉంటుందని, విలన్ పాత్ర ‘రావణుడి’ మాదిరిగా ఉంటుందని దర్శకుడు సందీప్ రాజ్ తెలిపారు. ట్రైలర్ విజువల్స్ రోషన్ పాత్రలోని తెగువను, ధృడ సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆయన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 0ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర (సాక్షి సాగర్ మడోల్కర్) డెఫ్ అండ్ డమ్గా డిజైన్ చేయబడింది. ‘ప్రేమకు భాష అవసరం లేదు, అది అనుభూతి చెందాలి’ అనే బలమైన ఫిలాసఫీని చెప్పేందుకు ఈ పాత్రను రూపొందించినట్టు దర్శకుడు పేర్కొన్నారు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ ఇందులో విలన్‌గా నటించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, గత కొన్నేళ్లుగా తెలుగులో ఇలాంటి విలన్ పాత్రను చూసి ఉండరని సందీప్ రాజ్ నమ్మకం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లో విలన్ పాత్ర ఇంటెన్స్‌గా, క్రూరంగా చూపబడింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చాయి. కాల భైరవ సంగీతం, రామ మారుతి సినిమాటోగ్రఫీ అడవి అందాలను, కథలోని ఇంటెన్సిటీని అద్భుతంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా, నేచురల్‌గా ఉంది.
Read also-Mrunal Thakur: డేటింగ్ రూమర్స్‌పై మృణాల్ ఠాకూర్ అదిరిపోయే రియాక్షన్.. ఇది ఒక్కటి చాలు..
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ‘వనవాసం’ వంటి పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రథమార్థం ఫన్నీగా ఉండి, ద్వితీయార్థంలో బలమైన ట్విస్ట్‌తో పాటు ఒక ఫిలాసఫీని చూపిస్తామని దర్శకుడు తెలిపారు. మొత్తం మీద, ‘మోగ్లీ 2025’ ఒక కొత్త తరహా ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
