Bhartha Mahasayulaku Wignyapthi: ‘బెల్లా బెల్లా’ సాంగ్ వైరల్
Bhartha Mahasayulaku Wignyapthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా’.. ‘బెల్లా బెల్లా’ వైరల్

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేయగా, మేకర్స్ ఇప్పుడు ఫుట్‌ ట్యాపింగ్ ట్రాక్‌ ‘బెల్లా బెల్లా’ విడుదల చేసి.. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

Also Read- Samantha Marriage: భూత శుద్ధి ప్రక్రియలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోవడానికి కారణమిదేనా?

వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా

మాస్ బీట్స్‌తో చార్ట్‌బస్టర్‌లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో, జానపద సంగీతంతో కూడిన ఫుట్‌ ట్యాపింగ్ నెంబర్‌గా ఈ పాటను కంపోజ్ చేశారు ఇన్‌స్ట్రుమెంటేషన్, విజువల్స్‌ను ఎలివేట్ చేస్తూ ఈ సాంగ్ సౌండ్‌స్కేప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇది చార్ట్ బస్టర్ లిస్ట్‌లోకి చేరే సాంగ్‌గా పిక్చరైజ్ చేశారు. ‘స్పెయిన్‌కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా.. వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా’ అంటూ.. సురేష్ గంగుల రాసిన లిరిక్స్‌లో వైబ్‌ అదిరిపోయింది. నకాష్ అజీజ్, రోహిణి సోర్రాట్ ఈ పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలెట్‌గా ఉంది. రవితేజ తన ట్రేడ్‌మార్క్ మాస్ మహారాజా స్వాగర్‌తో అదరగొట్టగా.. ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్‌గా అనిపిస్తోంది. సంగీత ప్రయాణానికి గ్రాండ్‌గా లాంచ్‌గా నిలిచిన ఈ సాంగ్ జింతాక్ లీగ్‌లో మరో చార్ట్‌బస్టర్‌గా మారనుంది. టెక్నికల్‌గానూ ఈ సాంగ్ హై స్టాండర్డ్స్‌లో ఉంది

క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కిషోర్ తిరుమలకే

సోమవారం జరిగిన సాంగ్ లాంచ్ వేడుకలో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రలో నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర పేరు బాలమణి. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కిషోర్ తిరుమలకే ఇవ్వాలి. అందరికీ ఈ పాట నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆషికాతో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన పాటలు ఉన్నాయి. త్వరలోనే అవి కూడా రాబోతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ సంక్రాంతికి చూడబోతున్నారని తెలిపారు.

Boyapati Srinu: చిరంజీవితో చేయడానికి నా దగ్గర కథ లేదు.. బోయపాటి షాకింగ్ కామెంట్స్!

చాలా డిఫరెంట్ పాత్రలో..

మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. మంచి కామెడీ, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా ఇది. సంక్రాంతి నాకు చాలా లక్కీ. ‘నా సామి రంగ’ సినిమాలో నేను చేసిన వరాలు క్యారెక్టర్‌పై ప్రేక్షకులు అద్భుతమైన ప్రేమని కురిపించారు. వరాలు కంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రవితేజ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన అద్భుతమైన డ్యాన్సర్. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చెప్పగా.. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి విడుదల అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండని కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు: కేటీఆర్

Nitin Nabin Sinha: ఆశావహుల ఆశలపై నీళ్లు.. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ సిన్హా..?

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ విజన్.. రైజింగ్ 2047ను ప్రదర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Drinking Water: జలమండలి ప్రత్యేక వ్యూహం.. రేపటికోసం కాస్త ముందుగానే కళ్లు తెరిచిన వాటర్ బోర్డ్!

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు