CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Rvath Reddy) హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ(Sanjay Kulshreshtha)ని కోరారు. హైదరాబాద్‌కు వచ్చిన కలశ్రేష్ఠను జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు
ఈ సందర్భంగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై చర్చించారు. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్ రీకన్‌స్ట్రక్చన్) అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకురాగా, వారు సానుకూలంగా స్పందించారు.
Also Read: Bhartha Mahasayulaku Wignyapthi: కలర్‌ఫుల్‌గా ఫస్ట్ సింగిల్.. సాంగ్ ప్రోమో చూశారా?
తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు
సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హడ్కో ఛైర్మన్ తెలియజేశారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఈ సందర్భంగా హడ్కో ఛైర్మన్‌ను ఆహ్వానించారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(PonguletiSrinivas Reddy) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
