Trivikram Venkatesh: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ స్టార్ వెంకటేష్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు, వెంకీ నటనతో ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ లెజెండరీ కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్న తరుణంలో, తాజాగా టైటిల్‌పై వినిపిస్తున్న పుకారు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read also-Rumour Controversy: వారి బ్రేకప్ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..
క్లాసిక్ టైటిల్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మేకర్స్ ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దాదాపుగా ఈ క్లాసిక్ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే త్రివిక్రమ్ మార్క్, స్వచ్ఛమైన తెలుగుతనం, సంప్రదాయం ఉట్టిపడుతున్నాయి. నేటి యాక్షన్ ఓరియెంటెడ్ టైటిల్స్ మధ్య, ఇలాంటి ఆహ్లాదకరమైన టైటిల్ ప్రేక్షకులకు నిజంగా రిలీఫ్‌ని ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే పేరు చూస్తేనే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా మరో అత్తారింటికి దారేది రేంజ్ హిట్ అవుదుంతని వెంకీ మామ అభిమానులు ఆసిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్టేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటకే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
The Girlfriend OTT: ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. డిటైల్స్ ఇవే!
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పక్కా
త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే కుటుంబ విలువలు, హాస్యం, ఎమోషన్స్‌తో కూడిన కథాంశం.. దానికి వెంకటేష్ తనదైన శైలి కామెడీ, సహజమైన నటన జోడైతే మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ టైటిల్ సైతం సినిమా కథాంశం బంధాలు, కుటుంబ సంబంధాల చుట్టూ అల్లబడిన లైట్-హార్టెడ్ డ్రామాగా ఉంటుందని హింట్ ఇస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ తర్వాత వెంకటేష్ చేస్తున్న సినిమా కావడం, ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ వెంటనే ఈ ఫ్యామిలీ టచ్ ఉన్న ప్రాజెక్టును ఎంచుకోవడం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
