Gaddam Prasad Kumar: శారీరక వ్యాయామమే కాదు.. జీవన విధానం
Gaddam Prasad Kumar ( IMAGE credit: swetcha reporter)
Telangana News

Gaddam Prasad Kumar: శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Gaddam Prasad Kumar: రోజు యోగా చేయడంతో అనారోగ్యాలు దరిచేరవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. హైదరాబాద్ రామంతాపూర్ లోని ఓ కళాశాలలో జరుగుతున్న 12వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా యోగాసన చాంపియన్ షిప్ ప్రారంభోత్సవంలో  పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ లానే యోగా పోటీలను నిర్వహించడంతో ఎక్కువ మందికి తెలుస్తుందని, సాధన చేస్తున్న వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు అన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం కూడా..నేను గత నలబైఏళ్లుగా రోజు యోగా సాధన చేస్తున్నానని, ఆరోగ్యంగా ఉన్నానన్నారు.

Also Read: Gaddam Prasad Kumar: నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

గల్ఫ్ దేశాలలోని ప్రజలు యోగాను ప్రాక్టీస్

ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర శాసన సభాపతి హోదాలో ఉండడంతో స్ట్రెస్ ను యోగా సాధనతో తగ్గిస్తానన్నారు. యోగా అందరిది, ఇది ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు, మంచి ప్రయోజనం ఇచ్చేది కాబట్టి అందరూ యోగాను ఆచరించవచ్చు అన్నారు. అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాలలోని ప్రజలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారని, ఆధునిక వైద్య విదానం నయం చేయలేని ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా సాధన ద్వారా సమాధానం లభించిందన్నారు.

యోగాతో శరీరంలో ఇమ్యూనిటీ

యోగా, ధ్యానం నిత్యం సాధతో మనిషిలో ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉంటారని, శారీరకంగా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. అన్ని వయసుల వారు యోగాను సాధన చేయవచ్చు అన్నారు. స్వంతంగా కంటే గురువుల మార్గదర్శకంలో యోగా సాధన చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నారు. యోగాతో శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నారు. శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా ప్రశాంతంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు.

Also Read: Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..

Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!