Balakrishna: పవన్ కళ్యాణ్ కు బాలయ్య డైరెక్ట్ కౌంటర్?
balayya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Balakrishna: నాకు చాలా వర్క్స్ ఉన్నాయి కానీ ఒకరే భార్య, పవన్ కళ్యాణ్ కు బాలయ్య కౌంటర్?

Balakrishna: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇద్దరి కాంబోలో వచ్చిన వరుస హిట్లతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేపథ్యంలో, ఈ మూవీ పై హైప్ మరింత పెరిగింది. డిసెంబర్ 5 రిలీజ్‌కు సన్నాహాల్లో భాగంగా మేకర్స్ ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని సరదాగా వివరిస్తూ
“ నేను పాదరసం లాంటి వాడిని. దేనిలో వేసినా అది ఆ ఆకారమే తీసుకుంటుంది కదా? నేను కూడా అలాగే ఏ రోలైనా, ఏ బాధ్యతైనా అట్టడుగు వరకు చేసి చూపుతా. నన్ను ఈ లోకానికి ఇచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నన్ను వాళ్లకి పుట్టించినందుకు భగవంతునికి కూడా రుణపడి ఉంటా.. ” అని అన్నారు.

అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా… బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా.. ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను ” అని చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ ఈ కామెంట్స్ చెప్పగానే, సోషల్ మీడియాలో కొంత చర్చ మొదలైంది. ప్రత్యేకంగా ఇతర స్టార్ హీరోలపై ఎప్పుడూ ‘మల్టిపుల్ మ్యారేజెస్’ అంటూ ట్రోలింగ్ చేసే కొందరు యాంటీ ఫ్యాన్స్… ఈ కామెంట్‌ను ఇప్పుడు తమదైన రీతిలో ఉపయోగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ‘అఖండ’ విషయానికి వస్తే.. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్, గ్లింప్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా సినిమాలో సనాతన ధర్మం, అఘోర తత్త్వం, రుద్ర తాండవం వంటి ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ఈసారి కూడా బాలయ్య–బోయపాటి కాంబినేషన్ సెన్సేషనల్ హిట్‌ను నమోదు చేస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది. సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందన్నది మాత్రం డిసెంబర్ 5న స్పష్టమవుతుంది.

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం