CM Revanth Reddy: రేపు విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: రేపు విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ముఖ్య అంశాలివే..!

CM Revanth Reddy: తెలంగాణలో వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం ప్రజలు తమ జేబులోంచి ప్రైవేట్ ఆసుపత్రులకు పెడుతున్న ఖర్చును భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల వైద్య ఖర్చులు ప్రైవేటు రంగంలో 37 శాతం ఉండగా.. 2047 నాటికి దీనిని కేవలం 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ రూపొందించిన ‘విజన్ 2047’ డాక్యుమెంట్‌పై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

విద్య వైద్యంపై పెట్టే ఖర్చు

ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ డీపీ)లో ప్రస్తుతం వైద్య రంగానికి ప్రభుత్వం కేవలం 1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తోంది. దీన్ని రాబోయే రోజుల్లో 5 శాతానికి పెంచాలని డిసైడ్ అయ్యింది. కేవలం ఆర్థిక వృద్ధే కాకుండా.. మానవ అభివృద్ధి (హ్యూమన్ రిసోర్సు)ని ప్రధాన వ్యూహంగా మార్చుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. విద్య, వైద్యంపై పెట్టే ఖర్చును పెంచడం ద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌లో నిలపాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో ఈపాటు గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పల్లెల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 42.8 శాతం మందే డాక్టర్లు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో దీన్ని 60 శాతానికి పెంచాలి. 2047 నాటికి వందశాతం డాక్టర్ల లభ్యత ఉండాలని లక్ష్యం పెట్టుకున్నది.

Also Read: Saree Colour Politics: అప్పుడు షర్మిల.. ఇప్పుడు కవిత.. చీర చుట్టూ ఈ రాజకీయమేంటో!

హెల్త్ ఏజింగ్ తెలంగాణ మిషన్

ప్రస్తుతం ప్రతి పదివేల మందికి డాక్టర్, నర్స్ నిష్పత్తి 10 ఉండగా.. దాన్ని 14కు పెంచనున్నారు. రాష్ట్రంలో వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలు తేనున్నారు. 2036 నాటికి రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 17 శాతానికి చేరనున్నారు. వీరి కోసం ‘హెల్త్ ఏజింగ్ తెలంగాణ మిషన్’ చేపట్టనున్నారు.సమగ్ర అభివృద్ధికి ‘హెల్త్ ఫస్ట్’ అనే కొత్త నినాదాన్ని ప్రభుత్వం ఎత్తుకుంది. ఇందులో భాగంగా టెక్నాలజీని విరివిగా వాడనున్నారు. రోగాల నిర్ధారణకు, స్క్రీనింగ్‌కు కృత్రిమ మేధ ను వినియోగించనున్నారు. ఆరోగ్యశ్రీలో సూపర్ స్పెషాలిటీ సేవలు, బస్తీ దవాఖానాల బలోపేతం, రక్తహీనత నివారణపై సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఆదివారం జరిగే రివ్యూ మీటింగ్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తదితరులు పాల్గొననున్నారు.

Also Read: Panchayat Elections: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి.. ఏకగ్రీవాల కోసం వేలంపాటలు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!