criminal history of MPs in lok sabha
Top Stories, జాతీయం

National: ఉత్తమ పార్లమెంటేరియన్ ఎవరున్నారు?

Criminal history of parliament members in lok sabha 251
ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంట్ లో సభ్యులు కీలకపాత్ర వహిస్తుంటారు. వారు ఉత్తమ సేవలందించాలి. ప్రజల గొంతుకలుగా పార్లమెంట్ లో పనిచేయాలని, ప్రజాహిత నిర్ణయాలను నిష్పాక్షికంగా తీసుకోవాలి. అందుకే ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఎంపిల పనితీరును అధ్యయనం చేసి వారికీ గుర్తింపుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అందించే అవార్డు. ఈ అవార్డును 1993లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్ పాటిల్ స్థాపించారు.అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత సమగ్రాభివృద్ధికి ప్రతిన బూనడానికి వేదికలుగా పార్లమెంట్లు కృషి చేయాలని విశ్వ మానవాళి కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యానికి పడుతున్న తూట్లు, బడుగులకు ప్రాతినిధ్యం కొరవడడం, రాక్షస రాజకీయ క్రీడలు, స్వేచ్ఛా హక్కుకు తలుపులు మూయడం, చట్ట సభలు డబ్బునోళ్లకే చుట్టాలుగా మారడం, అశాంతి నెలకొన్న సమాజం లాంటి పలు సవాళ్ల నడుమ నేటి పార్లమెంట్లు దారి తప్పుతూ ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కడం కొనసాగుతోంది.

నేర చరితులే ఎక్కవు

భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా నిరక్షరాస్యత, పేదరికం, అనంత అవినీతి, లింగ వివక్ష, అసమానతల అగాధాలు, ఉగ్రవాదం, నిరుద్యోగం, ప్రాంతీయ వాదనలు, కులమత వివక్షలు, విబేధాలు, డ్రగ్స్ దుర్వినియోగాలు, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, హింస, కోరలు చాస్తున్న క ాలుష్యం వంటి అంశాలు అనాిగా నిలుస్తున్నాయి. 17వ పార్లమెంట్ లోని రెండు సభలలో 776 ఎంపీలలో 306 మంది అంటే దాదాపు 40 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 25 శాతం మందిపై కేసులు అత్యం తీవ్రమైనవిగా గుర్తించారు. మన ఎంపీల సగటు ఆస్తులు రూ.38 కోట్లు ఉంగా అందులో 53 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రస్తుత 18వ లోక్ సభలో ఎంపికైన 543 మంది ఎంపీలలో 251 మంది అంటే 46 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు , 31 శాతం ఎంపీలపై తీవ్రమైన ఆరోపణలు నమోదు కావడం గమనార్హం.

క్రిమినల్ కేసులు

దాదాపు సగం మంది పార్లమెంట్‌ సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు కావడం, ధన బలం గెలుపును నిర్ణయించడం, కండబలం పార్లమెంటరీ స్ఫూర్తికి తూట్లు పొడవడం జరుగుతున్న నేపథ్యంలో భారత పార్లమెంట్‌ ప్రజల పక్షపాతి‌గా సేవలు అందిస్తుందనే విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతోంది. ప్రజాస్వామ్యం పరిహాసం పాలు కావడం, అధికారం స్వార్థ ప్రయోజనాలకు నెలవుగా మారడంతో పార్లమెంటరీ వ్యవస్థలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం ప్రమాదకర పరిణామంగా భావించాలి. పార్లమెంటరీ వ్యవస్థలు ప్రజాభిప్రాయాలకు పట్టం కట్టాలని, అసలైన నాయకులే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలని ఓటర్లు అభిప్రాయపడే రోజులు రావాలని కోరుకుందాం.

ప్రజాసమస్యలపై ఎలా స్పందిస్తారు

తొలి రెండు జనరల్ ఎలక్షన్స్‌‌లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మాత్రమే పోటీ చేశారు. వారినే గెలిపించారు. వారిలో ఎవరూ నేరచరితులు లేరు. కానీ, తర్వాత నుంచి జరిగిన ఎన్నికలలో రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం మందబలం, ఆర్థిక బలం ఉన్నవారి సాయం తీసుకోవడం మొదలుపెట్టారు. గత ఇరవయ్యేళ్ల నుంచి నేర చరిత్ర ఉన్న స్థానిక లీడర్లే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో ఉన్న ఎంపీలలో 18 నుంచి 20 శాతం నేరచరిత ఉన్నవారు ఉండగా, ప్రస్తుతం 42 శాతానికి పెరిగింది. మరి వీరంతా ప్రజాసమస్యలపై ముందు ముందు ఎలా స్పందిస్తారు?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు