Mowgli 2025: రోషన్ కనకాల 'మోగ్లీ ' నుంచి సెకండ్ సింగిల్ ఇదే..
mogli-2025(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mowgli 2025: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది..

Mowgli 2025: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ‘వనవాసం’ పాట, సినిమాలోని యాక్షన్, ఎమోషనల్ ఇంటెన్సిటీని పెంచింది. ‘మోగ్లీ 2025’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సయ్యారే’ రొమాంటిక్ మెలోడీగా అలరించగా, తాజాగా వచ్చిన ‘వనవాసం’ పాట పూర్తి భిన్నమైన మూడ్‌ను సెట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెరిగాయి.

Read also-Jay Krishna: జయకృష్ణను పరిచయం చేస్తూ అజయ్ భూపతి తీస్తున్న సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏంటంటే?

కాల భైరవ అందించిన ఈ ట్యూన్, అడ్రినలిన్-చార్జ్డ్ వార్ క్రై లాగా శక్తివంతంగా ఉంది. పాటలో వినిపించే పవర్ ఫుల్ రిథమ్, రా పవర్‌తో కూడిన కంపోజిషన్ శ్రోతలకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాట సాహిత్యం, సినిమా కథలో దాగి ఉన్న రామాయణ స్ఫూర్తిని బలంగా తెలియజేస్తుంది. తన ప్రేమను దక్కించుకోవడానికి కథానాయకుడు చేయాల్సిన ‘వనవాసం’, ఎదుర్కోవాల్సిన యుద్ధం తీవ్రతను ఈ లిరిక్స్ ప్రతిబింబిస్తున్నాయి. అడవి పవిత్రత, రాముడి యుద్ధం వంటి థీమ్స్ ను ప్రస్తావిస్తూ కథాంశానికి కీలకమైన హింట్ ఇచ్చారు. కాల భైరవ, సోనీ కోమండూరి గాత్రం పాటలోని భావోద్వేగాన్ని, తీవ్రతను అద్భుతంగా పలికించాయి. ఈ పాటను చూస్తుంటే.. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తుంది.

Read also-Keerthy Suresh: పని గంటల గురించి బాంబ్ పేల్చిన కీర్తి సురేశ్.. వారు నిద్రపోయేది ఎన్ని గంటలంటే?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోషన్ కనకాల సరసన సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్ ఈ పాటలు ప్రేక్షకులలో భారీ ఆసక్తిని పెంచాయి. ‘మోగ్లీ 2025’ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫైర్ అండ్ ఫ్యూరీతో కూడిన ఈ కొత్త పాట సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్ చూస్తుంటే.. అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?