Jay Krishna: లెజెండరీ సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన జయ కృష్ణ ఘట్టమనేని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన తొలి సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. కల్ట్ హిట్ చిత్రాలు ‘RX 100’, ‘మంగళవారం’ ఫేమ్ విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి ఈ లాంఛింగ్ వెహికల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ ఎమోషన్, రా ఇంటెన్సిటీ,0 రియలిస్టిక్ అంశాలతో కూడిన భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read also-Dharmendra Death: ధర్మేంద్ర మృతి తర్వాత తొలిసారి స్పందించిన హేమామాలిని.. ఏం అన్నారంటే?
ప్రీ-లుక్ ఎలా ఉందంటే..
టైమ్‌లెస్ కల్ట్‌గా నిలిచిపోయే ఒక ప్రేమకథను అందిస్తామని చెబుతూ, నిర్మాతలు సినిమా టైటిల్‌ను గ్రిప్పింగ్ ‘ప్రీ-లుక్’ పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో కథానాయకుడు, నాయికల పెనవేసుకున్న చేతులు కనిపిస్తాయి. గాయపడిన హీరో చేయి ఒక తుపాకీని గట్టిగా పట్టుకుని ఉండగా, అతని చేయిని ఆమె దృఢంగా పట్టుకుని ఉండటం కనిపిస్తుంది. ఇది సినిమాలో ప్రేమ, హై-స్టేక్స్ యాక్షన్ కలయికను సూచిస్తుంది. బ్యాక్‌డ్రాప్‌లో పవిత్ర తిరుమల దేవాలయం, ప్రశాంతమైన శేషాచలం కొండలు కనిపిస్తూ, కథకు మరింత లోతును, ఆధ్యాత్మికతను జోడించాయి. “రెండు జీవితాలు ఒకే ప్రయాణం. రెండు చేతులు ఒకే వాగ్దానం. రెండు హృదయాలు ఒకే గమ్యం” అనే క్యాప్షన్స్ ఈ ప్రీ-లుక్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
Read also-Keerthy Suresh: పని గంటల గురించి బాంబ్ పేల్చిన కీర్తి సురేశ్.. వారు నిద్రపోయేది ఎన్ని గంటలంటే?
తన పాత్ర కోసం జయ కృష్ణ ప్రస్తుతం ఇంటెన్సివ్‌గా శిక్షణ పొందుతూ, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రషా థడానీ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఆమె పాత్ర కథనంలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ గారితో కల్ట్ క్లాసిక్ ‘అగ్ని పర్వతం’ నిర్మించి, ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబును ‘రాజకుమారుడు’తో తెలుగు తెరకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు మూడో తరం స్టార్ అయిన జయ కృష్ణ ఘట్టమనేనిని సమర్పించడం విశేషం. ఈ చిత్రానికి ఇటీవలే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సపోర్టింగ్ కాస్ట్, ఇతర టెక్నికల్ క్రూ వివరాలను ప్రకటిస్తారు. టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేయగా, త్వరలోనే ఫస్ట్ లుక్ మరిన్ని అప్‌డేట్‌లు వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
My next film – #SrinivasaMangapuram ❤️🔥✊🏻
This lovestory is destined to stay in your hearts for ages ❤️#AB4 First Look blasting soon 🔥#JayaKrishnaGhattamaneni #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran@CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/6Y6QphpVcc
— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 27, 2025
