MLA Vijayaramana Rao: చెక్ డ్యాములను కాంగ్రెస్ నేతలే కూల్చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijayaramana Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చెక్ డ్యాములను నాసిరకంగా కట్టడం వల్లే కూలిపోయాయని అన్నారు. హరీశ్ రావు(Haruish Rao), కేటీఆర్(KTR) పదేళ్లు కమీషన్ల దందా చేశారని ఆరోపించారు. మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాములు గతంలో కూలాయని అన్నారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తా..
అసలు ఇసుక దందా చేసిందే బీఆర్ఎస్ వాళ్లని గుర్తు చేశారు. బాంబులు పెట్టి పేల్చినట్లు హరీశ్ రావు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, అబద్ధం అయితే ఆయన చేస్తారా అని సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. అసలు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్ధాల మీద అని విమర్శించారు. ‘‘బావబామ్మర్దులకు అబద్ధాలు ఆడితేనే కడుపు నిండుతుంది. చెక్ డ్యాము బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవి. డిజైన్ చేసింది హారీశ్ రావే. రూ.300 కోట్లు వెచ్చించి కట్టారు.
నేరెళ్లలో ఇసుక మాఫియా
అవన్నీ నాసిరకంగా కట్టడం వలన కూలిపోతున్నాయి. ఇసుక దొంగలందరూ కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులే. నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్టుకున్నారని దళితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించ లేదా? కాళేశ్వరం అద్భుతమన్నారు.. కుంగిపోలేదా? కాంగ్రెస్ హయాంలో నిర్మించిన చెక్ డ్యాములు ఎన్ని వరదలు వచ్చినా కొట్టుకుపోలేదు. పదేళ్లు కాంట్రాక్టర్లు, హరీశ్ రావు(Harish Rao), కేటీఅర్(KTR) కుమ్మక్కు అయ్యి డిజైన్ చేసి దోచుకున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక మాఫియా బంద్ అయ్యింది’’ అని ఎమ్మెల్యే వివరించారు.
Also Read: Syamala: హిందూపురంలో అంత రచ్చ జరుగుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ? బాలకృష్ణపై శ్యామల ఫైర్..

