NBK 111: ప్రారంభమైన బాలయ్యబాబు ‘NBK111’షూటింగ్..
nbk-111(X)
ఎంటర్‌టైన్‌మెంట్

NBK 111: ప్రారంభమైన బాలయ్యబాబు ‘NBK111’ షూటింగ్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..

NBK 111: తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ (NBK) 111వ చిత్రం షూటింగ్ నేడు (నవంబర్ 26, 2025) అధికారికంగా ప్రారంభమైంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న ఈ సినిమాపై దర్శకుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వీర సింహా రెడ్డి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో, ‘NBK 111’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో, సినిమా ప్రారంభం గురించి గోపీచంద్ మలినేని ఉద్వేగభరితమైన ప్రకటన చేశారు. దీనిని చూసిన బాలయ్యబాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అఖండ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read also-Champion Movie: రోషన్ ‘ఛాంపియన్’ సినిమా నుంచి ‘గిర గిర గిరగింగిరానివే’ లిరికల్ వీడియో వచ్చేసింది..

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా గోపీచంద్ మలినేని ఇలా రాసుకొచ్చారు.. “Big day. A new beginning… a new benchmark. This HISTORICAL ROAR, this vision… is finally taking its first breath,” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ చారిత్రక గర్జన, ఈ కల నేడు తమ మొదటి శ్వాసను తీసుకుంటుందని, ఈ ప్రాజెక్ట్‌ తమకు ఒక నూతన ఆరంభం, ఒక కొత్త బెంచ్‌మార్క్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడిగా తన లక్ష్యం స్పష్టంగా ఉందని, నందమూరి బాలకృష్ణ లాంటి ‘God of Masses’తో కలిసి ఈ ప్రయాణంలో అడుగులు వేయడం తన అదృష్టమని ఆయన కృతజ్ఞతా భావాన్ని ప్రకటించారు.

Read also-Mandhana Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదాకు కారణం ఇదే.. మామ కోసం పలాష్ ముచ్చల్ ఏం చేశారంటే?

చారిత్రక నేపథ్యం

‘NBK 111’ కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న భారీ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్‌లను, అత్యున్నత సాంకేతిక విలువలను ఉపయోగిస్తున్నారని సినీ వర్గాల టాక్. వెంకట సతీశ్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో, బాలకృష్ణ శక్తివంతమైన చారిత్రక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమె రాణి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది, ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు నేపథ్య సంగీతం కూడా సినిమా రేంజ్‌ను పెంచేలా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం మీద, గోపీచంద్ మలినేని బాలకృష్ణ ఈ కలయిక టాలీవుడ్‌లో నూతన రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చారిత్రక గర్జన ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?