Ponnam Prabhakar: వడ్డీ లేని రుణాలు.. చెక్కులు పంచిన మంత్రి
Ponnam Prabhakar (Image Source: Twitter)
Telangana News

Ponnam Prabhakar: మహిళా సంఘాలకు రూ.304 కోట్లు.. చెక్కులు పంచిన పొన్నం.. ఆపై ఆసక్తికర వ్యాఖ్యలు

Ponnam Prabhakar: తెలంగాణ మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాల మహిళలకు హైదరాబాద్ లోని నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్కులు అందజేశారు. రూ. 5 కోట్ల 66 లక్షల 16 వేల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలు పొందిన మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనీ ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.

Also Read: AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు పచ్చజెండా

మహిళా సంఘాల రుణాలకు సంబంధించి వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ఫష్టం చేశారు. 18 సంవత్సరాల పైన మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందనీ, ప్రజా పాలన ప్రభుత్వం.. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Also Read: iBomma Ravi Case: ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో.. కళ్లకు కట్టిన ఏసీపీ.. వెలుగులోకి మరిన్ని నిజాలు

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం