Puri Sethupathi: పూరీ సినిమా షూట్ తర్వాత సేతుపతి ఎమోషన్..
puri-setupathi( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Puri Sethupathi: పూరీ సినిమాలో చివరిరోజు షూట్ తర్వాత ఎమోషనల్ అయిన విజయ్ సేతుపతి.. ఎందుకంటే?

Puri Sethupathi: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. సుదీర్ఘంగా, భావోద్వేగాలతో, ఎంతో ఆనందంగా సాగిన ఈ ప్రయాణానికి తెరపడటంతో… నటుడు విజయ్ సేతుపతి భావోద్వేగానికి లోనయ్యారు. పూరీ జగన్నాథ్‌తో కలిసి పనిచేయడం మరపురాని అనుభూతిని ఇచ్చిందని, యూనిట్‌ను, ముఖ్యంగా పూరీని మిస్ అవుతున్నానని ఆయన ఎమోషనల్‌గా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, నిర్మాత ఛార్మీ కౌర్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణతో పాటు, వారు పంచుకున్న భావోద్వేగ క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘పూరి సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.

Read also-Dharmendra Modi: ధర్మేంద్రతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషన్ అయిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

భావోద్వేగ ప్రయాణం

“ఈ సినిమా యూనిట్‌తో, ముఖ్యంగా పూరి సర్‌తో కలిసి పనిచేసిన రోజులను నేను చాలా మిస్ అవుతాను” అని విజయ్ సేతుపతి హృదయపూర్వకంగా చెప్పారు. ఈ చిత్రీకరణ ప్రయాణం తనకు సంతోషాన్ని, సవాళ్లను ఇచ్చిందని, ప్రతిరోజూ మరపురాని అనుభూతిని మిగిల్చిందని ఆయన తెలిపారు. దీనికి స్పందించిన పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కూడా సెట్‌లో ఏర్పడిన అనుబంధాన్ని గురించి ప్రేమగా మాట్లాడారు. చివరి రోజు కావడం వల్ల కలిగిన కొద్దిపాటి విచారాన్ని దూరం చేస్తూ, విజయ్ సేతుపతి సరదాగా పూరి జాకెట్‌ను పొగడటం, నవ్వులు పూయించడం వంటి క్షణాలు వీడియోలో హైలైట్‌గా నిలిచాయి.

Read also-Tollywood: ‘దేవర, హరిహర వీరమల్లు, ఓజీ’.. ఈ సినిమాల పార్ట్ 2 సంగతేంటి? డౌటేనా?

హైప్ పెంచిన కాంబినేషన్

పూరీ జగన్నాథ్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటీమణులు టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి మోషన్ పిక్చర్స్‌కు చెందిన జెబి నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి – సేతుపతి కాంబినేషన్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.

Just In

01

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క

CM Revanth Reddy: యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలే లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి!