Nikhil Swayambhu: పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తర్వాత నిఖిల్ (Nikhil) రేంజే మారిపోయింది. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి మూడు సినిమాలు వచ్చినా, అవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’ (Swayambhu). ఈ సినిమాపై నిఖిల్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని సాహసోపేతమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రేక్షకులకు అత్యద్భుత ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని ప్రతీది మేకర్స్ చాలా కేరింగ్‌తో చేస్తుండటంతో ఆలస్యమవుతూ వస్తుంది. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్‌తో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌కి భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అదేంటంటే..
Also Read- Tollywood: ‘దేవర, హరిహర వీరమల్లు, ఓజీ’.. ఈ సినిమాల పార్ట్ 2 సంగతేంటి? డౌటేనా?
మహాశివరాత్రికి డేట్ ఫిక్స్..
రెండు సంవత్సరాల ప్రయాణం, 170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ మహత్తర చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవోపేతమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం రాబోయే మహాశివరాత్రి కానుగా 13 ఫిబ్రవరి, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల (Nikhil Swayambhu Release Date) కానుందని తెలుపుతూ.. గూస్‌బంప్స్ తెప్పించే మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు పనిచేయడం సవాలుతో కూడుకున్న అద్భుతమైన అనుభవం అని తెలియజేస్తూ.. ‘Rise of Swayambhu’ పేరుతో మేకింగ్ వీడియోను షేర్ చేశారు నిఖిల్. ‘ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు, వేల సవాళ్లు.. అదొక సామ్రాజ్యం. లక్షల మంది ప్రేక్షకులు, కోట్ల పెట్టుబడి.. మా నిర్మాతలు భువన్ శ్రీకర్‌ల నమ్మకం. ఇదే మా స్వయంభు’ అని నిఖిల్ తెలిపారు.
Also Read- Raju weds Rambai: ప్రాఫిట్ జోన్‌లోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథ
‘మన భారత దేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. అవి రాజుల కథలో లేదంటే యుద్ధ గాథలో కాదు. మన సంస్కృతికి పునాదులు, ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథే ఈ స్వయంభు’ అని చెబుతూ.. ఈ వీడియోలో నిఖిల్ తన గుర్రం ‘మారుతి’ని పరిచయం చేశారు. అలాగే ఈ మాగ్నమ్ ఓపస్‌ను సాకారం చేసిన టెక్నీషియన్ బృందాన్ని అభినందించారు. ఈ పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారనే విషయం తెలియంది కాదు. ఆ విషయం ఎప్పటికప్పుడు నిఖిల్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ, తెలియజేస్తూనే ఉన్నారు. కథనానికి ప్రామాణికతను ఇవ్వడానికి హిందీ వెర్షన్‌కూ స్వయంగా నిఖిల్ డబ్బింగ్ చెబుతుండటం విశేషం. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా వచ్చిన మేకింగ్ వీడియో చూస్తుంటే.. ఈ సినిమా కోసం టీమ్ ఎంతగా కష్టపడిందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Just like for Karthikeya2 I myself dubbed in Hindi for #Swayambhu
Ppl have been asking me as to What have i been doing for the last 2 years after K2 … do check it out 👇🏾love u all ♥️ pic.twitter.com/0thbTWkWW6— Nikhil Siddhartha (@actor_Nikhil) November 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
