Tollywood: టాలీవుడ్‌లో భారీ హైప్‌తో వచ్చిన చిత్రాలు ‘దేవర (Devara), ఓజీ (OG), హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’.. వీటిలో ‘ఓజీ’ మాత్రమే బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. అయితే ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్ ఉన్నట్లుగా అధికారిక ప్రకటనలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ వ్యవహారాలలో బిజీగా ఉన్న సమయంలో.. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో దర్శకుడు క్రిష్ (Director Krish) కూడా తప్పుకున్నాడు. అప్పుడు నిర్మాత రత్నం, తన కుమారుడు జ్యోతికృష్ణతో బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయించారు. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఫలితంగా నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో ఈ సినిమా సీక్వెల్ కష్టమనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే, ఇప్పటి వరకు నిర్మాత అసలు మీడియా ముందుకే రాలేదు.
Also Read- IBomma Ravi: 5 ఏళ్లలో రూ. 100 కోట్ల సంపాదన.. ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు వెల్లడి!
‘దేవర’ సీక్వెల్ ఎప్పుడు?
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) దేవర విషయానికి వస్తే.. ‘దేవర’ సీక్వెల్‌కు సంబంధించిన వర్క్‌లో కొరటాల శివ బిజీగా ఉన్నాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ‘దేవర’ కూడా అంచనాలకు తగిన విధంగా థియేటర్లలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. దీంతో సీక్వెల్ ఉంటుందా? అనేలా డౌట్స్ మొదలయ్యాయి. అందులో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గందరగోళం నెలకొని, సినిమా విడుదలైన చాలా కాలానికి గానీ మోక్షం లభించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న బిజీకి.. ‘దేవర’ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందనేది చెప్పడం కష్టమనే చెప్పాలి. ఈ లోపు కొరటాల ఇంకో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా కూడా వార్తలు మొదలయ్యాయి. చూస్తుంటే, ఈ సినిమా సీక్వెల్ డౌటే అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ వచ్చినా, అందుకు చాలా టైమ్ పట్టొచ్చు. ఈలోపు ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులలో ఉన్న హైప్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.
Also Read- Raju weds Rambai: ప్రాఫిట్ జోన్‌లోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘ఓజీ’ సీక్వెల్ ఎప్పటికి రావాలి..
ఇక ‘ఓజీ’ సినిమా విషయానికి వస్తే.. 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అయినా కూడా కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేకీవెన్ సాధించలేదు అన్నట్లుగా ఈ మధ్యకాలంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ చిత్ర సక్సెస్ వేడుకలో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సీక్వెల్‌కు ఓకే చెప్పారు. కానీ, ఇప్పటికిప్పుడు సీక్వెల్ తెరకెక్కించడానికి సుజీత్ సిద్ధంగా లేరు. ప్రస్తుతం ఆయన నానితో ఓ సినిమా అనౌన్స్ చేశారు. అలాగే నిర్మాణ సంస్థ కూడా సీక్వెల్‌పై అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. మరోవైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. పొలిటికల్‌గా ఆయన ఫుల్ టైమ్ కేటాయించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన వర్గాలు పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన చేయాల్సి వస్తే.. సేఫ్ గేమ్ ఆడతారు తప్పితే.. మళ్లీ ‘ఓజీ’ సీక్వెల్ అంటూ ప్రయోగాలు చేయరు. సో.. ఎలా చూసినా ఈ సినిమాలకు సీక్వెల్స్ కష్టమే అనేది అర్థమవుతుంది. ఒకవేళ వచ్చినా, దానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చలు నడుస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
