IBomma Ravi: 5 ఏళ్లలో రూ. 100 కోట్ల సంపాదన.. షాకింగ్ విషయాలు!
IBomma Ravi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

IBomma Ravi: 5 ఏళ్లలో రూ. 100 కోట్ల సంపాదన.. ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు వెల్లడి!

IBomma Ravi: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (IBomma) వెనుక ఉన్న కీలక వ్యక్తి ఇమ్మడి రవి (Immadi Ravi)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు ఇతర సినిమా పరిశ్రమలకు భారీ నష్టాన్ని కలిగించిన పైరసీ కార్యకలాపాలు, భారీ ఎత్తున అక్రమంగా డబ్బు సంపాదించడం, నిధులను మళ్లించడం వంటి ఆరోపణలపై రవిని అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఇమ్మడి రవిని 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ 5 రోజులు కస్టడీ ముగిసిన అనంతరం విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది. నిందితుడు రవి గత 5 ఏళ్లలో సుమారు రూ. 100 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. ఈ సంపాదనకు సంబంధించి రూ. 30 కోట్ల మేర బ్యాంక్ లావాదేవీలను పోలీసులు గుర్తించారు.

Also Read- Raju weds Rambai: ప్రాఫిట్ జోన్‌లోకి ‘రాజు వెడ్స్ రాంబాయి’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు

రవి పైరసీ సినిమాలను ప్రధానంగా టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా బేరమాడి, కొనుగోలు చేసేవాడు. సినిమా అమ్మిన వారికి యూఎస్‌డీటీ (USDT) వంటి క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు చేసేవాడు. ఐబొమ్మలో సినిమా రిలీజ్‌ చేసి కోట్ల రూపాయాలు సంపాదించాడని, ఇందులో సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్‌ యాక్సెస్‌ తీసుకోవాల్సి ఉంటుందని రవి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐబొమ్మలో సినిమా చూడాలంటే, వినియోగదారులు తప్పనిసరిగా కొన్ని యాడ్ లింక్‌లను యాక్సెస్ చేయాల్సి వచ్చేది. సినిమాపై క్లిక్ చేయగానే, మ్యాట్రిమోని, బెట్టింగ్, గేమింగ్ వంటి వివిధ రకాల ప్రకటనలకు సంబంధించిన 15 యాడ్ లింక్‌లకు యూజర్‌ను మళ్లించేవాడు. APK ఫైల్ లింక్‌లను పంపి, బెట్టింగ్ యాప్‌లను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు గుర్తించారు. సుమారు 50 లక్షల పైచిలుకు వ్యూయర్‌షిప్‌ను చూపి, దీని ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు.

Also Read- Dharmendra Deol: బాలీవుడ్‌ హీ-మ్యాన్‌ ధర్మేంద్ర గురించి ఈ విషయాలు తెలుసా? టాలీవుడ్ నివాళి..

ఫ్రెండ్‌కు పంపిన మెసేజే పట్టించింది

అక్రమంగా సంపాదించిన ఈ నిధులను దేశంలో ఉన్న ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంక్ అకౌంట్‌లకు బదిలీ చేసి, అక్కడి నుండి తిరిగి యూఎస్‌డీటీ ద్వారా మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ రవికి భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. దేశంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నింటిపై పెట్టని శ్రద్ధ, దీనిపై ఎందుకు పెడుతున్నారంటూ వితండవాదం వినిపిస్తున్నారు. పోలీసులు కూడా.. ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే, దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు రవి. అప్పటి నుంచి మాటేసిన పోలీసులు, ఫైనల్‌గా చాకచక్యంగా పట్టుకుని.. ఇండియన్ పోలీస్ పవరేంటో చూపించారు. ఇమ్మడి రవి అరెస్ట్‌ విషయంలో పోలీసులకు ఆయన భార్య సహకారం అందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నా, అందులో వాస్తవం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ‘నేను వచ్చాక కలిసి తాగుదాం’ అని తన ఫ్రెండ్‌కు పంపిన మెసేజ్ ద్వారా రవిని పోలీసులు ట్రాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!