CM Revanth Reddy: అందె శ్రీ నాకు అత్యంత అప్తుడు.. నా మనసుకు దగ్గరి వాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది.. ఎంత అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుందని అన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి(Bandi Yadagiri) బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలిందని అన్నారు. సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్(Gaddar),గూడా అంజన్న(Guda Anjanna), అందె శ్రీ(Ande Sri,), గోరేటి వెంకన్న(Goreti Venkanna)తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని అన్నారు.
తెలంగాణ పాట మూగబోయింది
బడి మొహం ఎరుగని అందె శ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారు. ప్రతి తెలంగాణ గుండె కు జయ జయహే తెలంగాణ పాటను అందె శ్రీ చేర్చారని సీఎం అన్నారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారు. కాని ఆ నాటి పాలకులు జయ జయ హే తెలంగాణ పాట మూగబోయిందని, అధికారం శాశ్వతం అని వారు ఆ నాడు భావించారని అన్నారు. తెలంగాణలో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారు. పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని, గడీలను కూల్చుతాని అందె శ్రీ నిరూపించారు. ఇప్పుడు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటను నిత్యం పాడుకుంటున్నారని అన్నారు. అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందె శ్రీ కోరుకున్నారని సీఎం అన్నారు.
Also Read: Hyderabad Police Dance: కమల్ హాసన్ సాంగ్‌కు.. దుమ్మురేపిన హైదరాబాద్ పోలీసులు.. ఓ లుక్కేయండి!
అందె శ్రీ స్మ్రుతి వనం
అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం.. అందె శ్రీ స్మ్రుతి వనాన్ని నిర్మిస్తున్నాం, ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాంమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చాంమని భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తాంమని అన్నారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని, నా మంత్రి వర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారు. కవులు ఎంత మంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని సీఎం అన్నారు.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఏకంగా 37 మంది లొంగుబాటు.. డీజీపీ కీలక ప్రకటన
