IBomma Piracy Case: ‘ఐ బొమ్మ’ రవి బయటకు రావడం కష్టమేనా..
i-bomma-update(X)
ఎంటర్‌టైన్‌మెంట్

IBomma Piracy Case: ‘ఐ బొమ్మ’ రవి చుట్టూ బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు.. బయటకు రావడం కష్టమేనా?

IBomma Piracy Case: ‘దమ్ముంటే పట్టుకోండి’ అని సవాల్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. పోలీస్ కస్టడీలో భాగంగా రవిని నిశితంగా విచారించగా, అతని పైరసీ సామ్రాజ్యం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వచ్చాయి. రవిపై ఇప్పటికే నమోదైన మొత్తం ఐదు కేసుల్లో మిగిలిన నాలుగింటిలో కూడా అరెస్ట్ చూపించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. దాంతోపాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన కేసులను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు.

Read also-Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో సిట్ దూకుడు.. నిధి, శ్రీముఖితో సహా ముగ్గురి విచారణ!

క్రిప్టో కరెన్సీతో చెల్లింపులు

మొదటి రోజు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన అధికారులు, రెండో రోజు రవికి సినిమాలను సప్లై చేస్తూ వచ్చిన నెట్‌వర్క్ వివరాలు సేకరించారు. ఈ క్రమంలో తమిళం, హిందీ వెబ్‌సైట్ల నుంచి తాను సినిమాలు కొన్నట్టుగా రవి వెల్లడించాడు. ముఖ్యంగా ‘మూవీ రూల్జ్’ అనే వెబ్‌సైట్ నుంచి ఎక్కువగా సినిమాలు కొన్నానని, దానికి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపానని తెలిపాడు. ఈ క్రిప్టో చెల్లింపుల కోసం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించినట్టు చెప్పాడు. ప్రేక్షకులను పెంచుకోవడానికే హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలను అప్‌లోడ్ చేశానని కూడా రవి వెల్లడించాడు.

ఆఫీస్ కూడా అక్కడే..

పైరసీ కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించటానికి రవి కరేబియన్ దీవుల్లో ఒక ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలో తేలింది. 20 మంది యువకులను ఉద్యోగులుగా పెట్టుకుని కంటెంట్‌ను అప్‌లోడ్ చేయిస్తూ వచ్చానని రవి చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, గతంలో రవిని అరెస్ట్ చేసినప్పుడు అతనిపై బీఎన్ఎస్, ఐటీ, సినిమాటోగ్రఫీ, ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. తాజాగా, రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో పాన్ కార్డు, బైక్ లైసెన్స్, ఆర్‌సీ తీసుకున్నట్టు వెల్లడవడంతో, అతనిపై ఫోర్జరీ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఈ వివరాలతో కూడిన మెమోను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

ఎస్‌బీఐ పోర్టల్‌ హ్యాక్

రవి విచారణ జరుగుతుండగానే, పైరసీ వ్యవహారాలు నడిపిస్తున్నవారు ఐబొమ్మ లింకును ఎస్‌బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌కు లింక్ చేశారు. ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్ల నుంచి లింకును కాపీ చేసి ఎస్‌బీఐ పోర్టల్‌లో పేస్ట్ చేస్తే సినిమాలు చూసేలా కథ నడిపించారు. దీనిపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్‌బీఐ టెక్నికల్ టీం సభ్యులను పిలిపించి వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టుగా బయటపడింది.

Read also-War 2 failure reaction: ‘వార్ 2’ విషయంలో చేసిన తప్పు ఒప్పుకున్న హృతిక్ రోషన్.. ఎందుకంటే?

బయటికి కష్టమే

రవి నెట్‌వర్క్‌లో ఇంకా చాలామంది ఉన్నట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి వివరాలను రవి నుంచి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరెస్టయిన రవి ఇప్పట్లో బయటికి రావడం కష్టమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్క కేసులోనే అరెస్ట్ చూపించినా, పెండింగ్‌లో ఉన్న మరో 4 కేసుల్లోనూ, కొత్తగా నమోదైన ఫోర్జరీ కేసుల్లోనూ రవిని వరుసగా అరెస్ట్ చూపిస్తామని అధికారులు తెలిపారు.

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!