Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న నాల్గవ చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి సగర్వంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా.. శుక్రవారం మేకర్స్ కర్నాటకలో జరిగిన భారీ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటసింహం బాలయ్య మాట్లాడుతూ..
Also Read- 3 Roses S2 Teaser: చీజ్ బజ్జీలు, హాట్ గాళ్స్‌తో.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా!
ఇదంతా ప్రకృతి, శివుని ఆజ్ఞ
‘‘ఇంత వర్షం పడుతున్నా.. వర్షానికి లెక్కచేయకుండా గట్టులను దాటి, పడి లేచే ఇక్కడికి విచ్చేసిన తమ్ముడు శివన్న, అలాగే నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జన సంద్రాన్ని చూస్తుంటే నేల ఈనిందా? ఆకాశానికి హోల్ పడిందా? అన్నట్లుగా ఉంది. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి, మీ అందరిని గుండెల్లో నిలిచేలా చేసిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మా నాన్న నందమూరి తారక రామారావుకు నమస్కరిస్తున్నాను. మా నాన్న, ఇక్కడ వచ్చేసరికి రాజ్ కుమార్.. వాళ్లు చేయని పాత్ర లేదు. శివరాజ్ కుమార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న శివన్నకు ఆశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు ఉదయం వర్ష సూచన లేదు. మేము హోటల్ నుంచి వచ్చేటప్పటికి కుంభవృష్టి కురిసింది. తర్వాత ఆగిపోయింది. ఈ వేడుకకు వచ్చే ముందు మళ్లీ కురిసింది. ఈ వేదికపైకి వచ్చేసరికి వర్షం లేదు. ఇదంతా ప్రకృతి, శివుని ఆజ్ఞ. ‘అఖండ’ కేవలం తెలుగు, కన్నడ సినిమా మాత్రమే కాదు.. ఇది పాన్ ఇండియా సినిమా.
Also Read- Akhanda 2 Trailer: ‘అఖండ 2: తాండవం’ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..
హిట్ కొడుతున్నాం
కరోనా టైమ్‌లో అందరూ భయపడుతుంటే, మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో ‘అఖండ’ చిత్రాన్ని విడుదల చేశాం. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ వరసగా రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలో పిల్లలు, ప్రకృతి, ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడని చూపించాము. యువత మంచిదారిలో నడవడానికి.. నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నాను. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అంతా చూస్తారు. బోయపాటితో నాకిది నాలుగో సినిమా. ‘అఖండ 2: తాండవం’ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పాత్రల్లో జీవించారు. నేను ఏ పాత్ర చేసినా కూడా.. ఆ పాత్ర నన్ను ఆవహించేస్తుంది. ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు, అని మన సనాతన హైందవ ధర్మం చెబుతుంది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం ఎలా ఉంటుందో చూస్తారు. సంగీత దర్శకుడు తమన్ థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా ఆయనకి శివుడు పూనాడు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ని మళ్ళీ ఇక్కడే జరుపుతాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హిట్ కొడుతున్నాం అని చెప్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
