Tuesday, July 2, 2024

Exclusive

Telangana:‘అప్పు’డే ఆ పని చేయొద్దు?

  • కొత్తగా అప్పులు చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖకు రేవంత్ ఆదేశం
  • బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కు చుట్టుకుంటున్న తిప్పలు
  • నాటి సర్కార్ చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు కడుతున్న కాంగ్రెస్
  • రోజుకు రూ.207 కోట్ల వడ్డీ కడుతున్న రేవంత్ సర్కార్
  • నెలకు రూ.6 వేల కోట్లుకు పైగానే ఉన్న కట్టవలసిన వడ్డీలు
  • మరో పక్క రైతు రుణమాఫీపై ముంచుకొస్తున్న గడువు
  • రేవంత్ సర్కార్ ను ఊపిరి సలపకుండా చేస్తున్న బీఆర్ఎస్
  • అయినా ఆర్థిక సంయమనం పాటిస్తున్న రేవంత్ రెడ్డి
  • ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆర్థిక శాఖకు రేవంత్ కీలక ఆదేశాలు

Congress government deside to decrease debts for finalnce discipline :
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత చందాన ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మూడు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు రావడం దానితో పథకాలు అన్నీ కోడ్ పుణ్యమా అని నిలిచిపోయాయి. ఇక పాలన గాడిలో పెట్టే పనిలో రేవంత్ సర్కార్ ఉంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సమస్య రుణ మాఫీ. ఆ తర్వాత ఆరు హామీలు నెరవేర్చేందుకు సమకూరవలసిన డబ్బు. ఇవన్నీ పక్కనపెడితే గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కు తిప్పలుగా తయారవుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం అప్పులు, జీతాల చెల్లింపులకే పోతోంది. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులకు నెల నెలా వడ్డీలు కట్టవలసిన దుస్థితి ఏర్పడింది. యావరేజ్ న చూస్తే రోజుకు రూ.207 కోట్లు కేవలం వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో సంక్షే పథకాలను అమలు చేసేదెలా? అన్నదే రేవంత్ సర్కార్ ను వేధిస్తున్న సమస్య,

కొత్తగా అప్పులు చేయొద్దు

అందుకే రేవంత్ సర్కార్ కేలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా అప్పులు ఇష్టారీతిన చేయొద్దనే నిర్ణయం తీసుకుంది. నెలకు కేవలం తెచ్చిన అప్పులకు కట్టే వడ్డీ రూ.6 వేల కోట్లకు పైగానే అని స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ చేసిన అప్పులు ఎలాగోలా తిప్పలు పడి కడుతుంటే పదే పదే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్ ను రెచ్చగొట్టి ఇరుకున పెడుతున్నారు. రుణమాఫీ డెడ్ లైన్ అందులో భాగమే. ఇలాంటి డెడ్ లైన్స్ రెచ్చగొట్టి పెట్టించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా చేయడమే అని రాజకీయ విమర్శకులు సైతం బీఆర్ఎస్ ఎత్తుగడలను ఎండగడుతున్నారు. ఇప్పటి దాకా రేవంత్ సర్కార్ ప్రయోపయోగ నిర్మాణాలు, పథకాలు తదితర పనులకు గాను దాదాపు రూ.7 వేల కోట్ల మూలధన వ్యయంగా ఖర్చు చేసింది.

ఆర్థిక క్రమశిక్షణ

గత సర్కార్ ఇష్టారీతిన చేసినట్లుగా గాక ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రేవంత్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక శాఖకు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ లిమిట్స్ కు లోబడి మార్కెట్ రుణాలు తీసుకుని బడ్జెట్, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్ధుబాటు విధానాన్ని రేవంత్ సర్కార్ పాటిస్తోంది. పైగా గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అప్పులు తగ్గుముఖం పట్టేలా చేశారు రేవంత్  . గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతం. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించింది. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు చేసింది ఎక్కువగా ఉండటం రేవంత్​ సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది.

ఠంచన్ గా ఉద్యోగుల జీతాలు

. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. భారీ నిధులతో కూడుకున్న పనులే. వీటన్నింటికీ మించి ప్రతి నెలా మొదటి అయిదు రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలను పంపిణీ చేసే ప్రక్రియను పునరుద్ధరించిన తీరు రేవంత్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సాక్ష్యం.
. గత ప్రభుత్వం బడ్జెట్లో చూపించకుండా గుట్టుగా లోన్లు తెచ్చినట్లు కాకుండా.. రిజర్వు బ్యాంకు నుంచే బహిరంగంగానే మార్కెట్ రుణాలు తీసుకుంది. వీటిలో ఒక్క రూపాయి కూడా నిరర్థకంగా ఖర్చు చేయలేదు. తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించుకుంటూ వస్తోంది. . కాగా ఇప్పటిదాకా తెచ్చిన అప్పులన్నీ 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ. 59 వేల 625 కోట్ల కేటాయింపులనుంచే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సైతం ప్రకటిచింది కాంగ్రెస్ సర్కార్.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

National: మూడోసారి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ రాహుల్ లా ప్రవర్తించకండంటూ ఎంపీలకు సూచన అధికార, మిత్ర పక్షాల నేతలకు దిశానిర్దేశం మీడియా కామెంట్స్ కు ముందు ఆ సమస్యపై స్టడీ...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...

Hyderabad: విస్తరణకు వేళాయే

ఈ నేల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం గవర్నర్ తో సుదీర్ఘ సమావేశం ...