Amala Akkineni: అమల అక్కినేని.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కింగ్ నాగార్జున భార్యగా (King Nagarjuna Wife), అక్కినేని కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతూ.. చాలా తక్కువగా మాత్రమే ఆమె దర్శనమిస్తుంటారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రస్థానాన్ని కలిగి ఉన్న అమల.. నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి, గృహిణిగా బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన మదర్ పాత్రలు రావడంతో ఒకటి రెండు సినిమాలలో కూడా నటించారు. నటిగా ఆమె పేరు వినిపించకపోయినా, జంతువుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థ ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ విషయంలో ఆమె పేరు విరివిగా వినిపిస్తుంటుంది. పబ్లిక్ లైఫ్‌లో చాలా తక్కువగా కనిపించే అమల అక్కినేని.. ఫస్ట్ టైమ్ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ (Amala Akkineni Interview) ఇచ్చి, అందులో అనేకానేక విషయాలను, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని తన జీవితంలోని సంఘటలను చెప్పుకొచ్చారు.
బాల్యం గడించిందిలా..
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రజలకు నా గురించి ఎక్కువగా తెలియదు. నాగార్జునతో పెళ్లి తర్వాతే నేను తెలుసు. నేను నేవీ ఆఫీసర్స్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. అమ్మ ఐరీష్, నాన్న బెంగాలి. నేవీ జాబ్ కావడంతో డిఫరెంట్ ప్లేస్‌కు వెళ్లాల్సి వచ్చేది. అలా వైజాగ్ వచ్చినప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఏడు ఎనిమిదేళ్లు ఉంటాయి. భరతనాట్యం క్లాసులకు వెళ్లడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించేది. మా డ్యాన్స్ టీచర్.. అమ్మతో నాకు టాలెంట్ ఉందని చెప్పి, చెన్నైలోని కళాక్షేత్రలో చేర్పిస్తే చాలా హైట్స్‌కి వెళుతుందని చెప్పడంతో.. వెంటనే అక్కడకు తీసుకెళ్లారు. అమ్మ ఎంతో సపోర్టెడ్‌గా ఉండేది. చెన్నైకి తీసుకెళ్లి, అక్కడి హాస్టల్‌లో జాయిన్ చేయించారు. అక్కడే స్కూల్, డ్యాన్స్ నేర్చుకుంటూ.. తొమ్మిది పదేళ్ల వరకు కళాక్షేత్రలో ఉన్నాను. స్కూలింగ్, డిగ్రీ అంతా అక్కడే పూర్తి చేశాను. కళాక్షేత్ర డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. అలా ప్రదర్శనలు ఇచ్చే సమయంలో మా ప్రిన్సిపాల్, డైరెక్టర్‌కు మధ్య వాగ్వివాదం నడిచేది. అలా టూర్లకు తీసుకెళితే.. అటెండెన్స్ పోతుందని అంటూ ఇద్దరి మధ్య ఎప్పుడూ మాటలు నడుస్తూనే ఉండేవి. నాకు కూడా క్లాసులో కూర్చుని పాఠాలు నేర్చుకోవడం ఇష్టముండేది కాదు, టూర్లలో ఎన్నో ప్రదేశాలు, చరిత్రలు తెలుసుకోవాలని ఉండేది. ఇప్పుడు మా స్టూడెంట్స్‌కు కూడా అదే ఫ్రీడమ్ ఇస్తున్నాను. వెస్ట్రన్ కల్చర్ గురించి ఏదేదో అనుకుంటారు కానీ, దాని వల్ల ప్రతి ఒక్కరికీ మైండ్ డెవలప్ అవుతుంది. ప్రతిదానికి పేరేంట్స్‌పై ఆధారపడకుండా ఉండటం తెలుస్తుంది. నేనప్పట్లో అలా టూర్స్ చేయడంతో.. ఇప్పటికీ ఎక్కడైనా అడ్జస్ట్ అవగలను. అలాగే నేను ఐదు భాషలు కూడా నేర్చుకోగలిగాను. అయితే ఎక్కడికి వెళ్లినా కూడా నేను భారతీయురాలిని అనే ఫీలింగ్ మాత్రం నరనరాల్లో నాటుకుపోయింది. ఐ లవ్ ఇండియా.
Also Read- Hyper Aadi: అలిగాడు సరే.. రాజమౌళి గత ట్వీట్స్ సంగతేంటి ఆది?
వారే నాకు మొదటి గురువులు
నా చిన్నతనంలో నేర్చుకున్నవన్నీ ఇప్పుడు ఎంతగానో యూజ్ అవుతున్నాయి. అవన్నీ నా తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకున్నాను. వారే నాకు మొదటి గురువులు. వాళ్లు చాలా కష్టపడి పైకొచ్చారు. నాన్న.. ఈస్ట్ బెంగాల్ పార్టిషన్ టైమ్‌లో రాత్రికి రాత్రి ఇల్లు, ఆస్తి మొత్తం వదిలేసి, పారిపోయి ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నోజ్‌కు వచ్చేశారు. 10 ఏళ్ల వయసులో నాన్న అలా ఏమీ లేకుండా వచ్చేసి, ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు. అప్పుడు బ్రతకడానికి కేవలం తన మైండ్‌ని మాత్రమే నమ్ముకున్నారు. మొత్తం అన్నాచెల్లెళ్లు అందరూ 10 మంది ఉంటే, అందరిలో నాన్నే పెద్దవాడు కావడంతో భారం మొత్తం ఆయనే మోయాల్సి వచ్చింది. బాగా చదివితేనే పైకి వస్తామని భావించి, ఎంతో కష్టపడ్డారు. స్కాలర్‌షిప్‌తో చదువుకుని, నేవీలో జాయిన్ అయ్యారు. నేవీ వాళ్లు యుకే పంపించారు. అక్కడ నాన్నకి అమ్మ పరిచయమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నాన్న ఎప్పుడూ స్మోక్, డ్రింక్ చేయడం నేను చూడలేదు. ఒక్కసారి నేవీ వేడుకలో డ్రింక్ చేశారు. అందరిలో ఉండి, వాళ్ల అలవాట్లు నేను ఎందుకు నేర్చుకోవాలి? అనే మనస్థత్వంతో ఉండేవారు. ఎటువంటి ఆడంబరాలకు పోయే వారు కాదు. ఒకరికి ఇవ్వడమే కానీ, ఒకరి దగ్గర నుంచి ఏం తీసుకునే వారు కాదు. చాలా సింపుల్‌గా ఉండేవారు. మనం బతకడానికి ఇది చాలు అనే సింపుల్ ఫిలాసఫీతో ఉండేవారు. ఆయన ఏమైనా సేవ్ చేస్తే.. వాళ్ల బ్రదర్స్, సిస్టర్స్ చదువుల కోసమే వినియోగించేవారు. అమ్మ కూడా ఏమీ అనేది కాదు. మా ఇంటిలో సర్వెంట్స్ ఉండరు. ప్రతీది మేమే చేసుకునే వాళ్లం. ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎలా అయితే జీవిస్తుందో మేము కూడా అలాగే జీవించాం. వారి నుంచి నాకు ఈ విలువలన్నీ వచ్చాయా? అంటే అవుననే చెబుతాను. ఈ జర్నీలో మా డ్యాన్స్ టీజర్ ఇన్‌ప్లూయెన్స్ కూడా నాపై ఉంది’’ అని అమలు భావోద్వేగానికి లోనైయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
