Seethakka: ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఇందిరమ్మ చీర ఇవ్వాలి
Seethakka ( image credit: twitter)
Telangana News

Seethakka: ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఇందిరమ్మ చీర ఇవ్వాలి.. ఆఫీసర్లకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

Seethakka: ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీమతి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగాలని ఆమె పేర్కొన్నారు.సెర్ప్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీతక్క, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితో పాటు మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు కూడా లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి, వారికి బొట్టుపెట్టి ఇందిరమ్మ చీరలను అందజేయాలని సూచించారు.

మహిళల ఐక్యతను చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి చేరుస్తామన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇంకా స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు వెంటనే అవగాహన కల్పించి, సభ్యత్వం ఇచ్చి ఇందిరమ్మ చీరలను అక్కడికక్కడే అందించాలని ఆదేశించారు. నూతన లబ్ధిదారులను గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ సహకారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు.

Also Read: Minister Seethakka: నెదర్లాండ్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు తెలిపిన మంత్రి సీతక్క

దశలవారీ షెడ్యూల్ ఖరారు

సెర్ప్ ప్రొఫైల్ యాప్ ద్వారా ప్రస్తుత, కొత్త లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ యాప్ ద్వారా ఆధార్ డేటా, ఫోటోల సేకరణ జరగాల్సి ఉన్నందున అధికారులు పూర్తి సన్నద్ధతతో వ్యవహరించాలని సీతక్క సూచించారు. పంపిణీ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు మొదటి దశలో, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 9 వరకు రెండో దశగా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి, నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయిల వరకు పంపిణీని పర్యవేక్షించేలాగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పండుగ వాతావరణంలో

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటే విధంగా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యక్రమం జరగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులందరికీ మండల స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానం పలకాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపే పండుగలా మారాలని, ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం పెంచాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు.

Also Read: Seethakka: మహిళా సమాఖ్యలతో కొత్త చరిత్ర.. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!