Accident Video: కొందరు వాహనదారుల నిర్లక్ష్యం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. నిబంధనలు పాటించకుండా, క్రమశిక్షణ లేకుండా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
వివరాల్లోకి వెళ్తే..
సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపూర్ గ్రామ శివారులో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. ప్రమాద దృశ్యాలు అదే మార్గంలో వెళ్తున్న మరో కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతోంది. వన్ వే రోడ్డులో కారు చాలా వేగంగా వెళ్లడాన్ని వీడియోలో గమనించవచ్చు. సాధారణంగా వన్ వే రోడ్డులో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు రోడ్డు మధ్యలో గీతలు గీస్తుంటారు. ఆ గీతకు ఇరువైపులా వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. ప్రమాదానికి కారణమైన కారును గమనిస్తే.. అది ఆ లైన్ ను ఏమాత్రం ఫాలో కాలేదు. ప్రమాదానికి ముందు రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా కారు ప్రయాణించింది.
Also Read: YS Jagan – Sunitha: నాంపల్లి కోర్టులో ఆసక్తికర సన్నివేశం.. జగన్‌కు ఎదురుపడ్డ సునీత.. తర్వాత ఏమైందంటే?
రాంగ్ రూట్‌లోకి వెళ్లి..
కారు డ్రైవర్ అవసరం లేకపోయినా కూడా నిర్లక్ష్యంగా మిడిల్ లైన్ దాటి ఎదురుగా వాహనాలు వచ్చే మార్గంలోకి వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా బైక్ రావడంతో దానిని బలంగా ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అమాంతం పైకి ఎగిరి కిందపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇతర వాహనదారులు, స్థానికులు.. బాధితుల వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. తీవ్రంగా గాయపడిన బాధితులను హుటాహూటీన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సిద్దిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్
నారాయణరావు పేట శివారులో ఓ కారు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైకర్తోపాటు అతడి వెనుక కూర్చొన్న మరోవ్యక్తి కూడా గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ఘటన అదే మార్గంలో వెళ్తున్న మరో కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యింది. pic.twitter.com/N9UqEGHGbN
— Swetcha Daily News (@SwetchaNews) November 20, 2025
