Akhanda 2: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అతిథిగా హాజరవుతారనే బలమైన ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త కేవలం సందడికి మాత్రమే పరిమితం కాకుండా, మొదటి భాగం ‘అఖండ’ విషయంలో నెలకొన్న ఒక అద్భుతమైన సెంటిమెంట్‌ను గుర్తుచేస్తోంది. నందమూరి బాలకృష్ణ అభిమానులు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. హైదరాబాద్, యూసఫ్‌గూడా లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ‘పుష్ప 2’ విడుదల తర్వాత అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి మధ్య రాజకీయపరమైన చర్చలు నడిచిన నేపథ్యంలో, వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం అనేది సినీ వర్గాలకు, అభిమానులకు పెద్ద ‘సర్ప్రైజ్’ మూమెంట్ కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరోలు కూడా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది.
Read also-Shriya Saran: తన అభిమానులను అలర్ట్ చేసిన హీరోయిన్ శ్రియ శరణ్.. ఏం జరిగిందంటే?
‘అఖండ’ సెంటిమెంట్..
2021లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘అఖండ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ వేదికపై ఐకాన్ స్టార్ ఇచ్చిన ప్రోత్సాహం, బాలకృష్ణతో ఆయన పంచుకున్న అనుబంధం సినిమాకు మరింత పాజిటివ్ వైబ్‌ను తీసుకొచ్చాయి. ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, ‘అఖండ 2’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలనే బలమైన కోరికతో, మేకర్స్ అదే ‘లక్కీ గెస్ట్’ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, బాలకృష్ణ మధ్య వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఇటీవల, బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోలో అల్లు అర్జున్ పాల్గొని, వారిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధాన్ని దృఢపరిచారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ‘అఖండ 2’ వేదికపై కనిపించడం అనేది కేవలం అభిమానులకే కాదు, చిత్ర యూనిట్‌కు కూడా భారీ ఉత్సాహాన్ని అందించే విషయం.
Read also-Varanasi IMAX format: ‘వారణాసి’ సినిమా కోసం ఉపయోగించే కెమెరా గురించి తెలుసా.. ఇండియాలో ఇదే ఫస్ట్
అంచనాలు ఆకాశంలో..
‘అఖండ 2’ నుండి ఇప్పటికే విడుదలైన ‘జాజి కాయ’ పాట దాదాపు 10 మిలియన్ల వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్, అఖండ సెంటిమెంట్ – వీటన్నిటికీ తోడుగా అల్లు అర్జున్ రాక ఖరారైతే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మెగా ఈవెంట్‌గా నిలవడం ఖాయం. ఏది ఏమైనప్పటికీ, ‘అఖండ 2’ మేకర్స్ నుండి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, అల్లు అర్జున్ రాక వార్త సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో సృష్టిస్తున్న అలజడి చూస్తుంటే, ఈ సెంటిమెంట్ నిజమై, ‘అఖండ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద రోరింగ్ సక్సెస్ సాధిస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

