Varanasi IMAX format: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా కథానాయిక ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమాపై ఎంత బజ్ ఉందో తెలిసిందే. ‘వారణాసి’తో భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే IMAX కెమెరా ఫార్మాట్ గురించి సినీ వర్గాల్లోనే కాకుండా, ప్రేక్షకులందరిలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి కెమెరా ప్రపంచంలో చాల తక్కువ మంది ఉపయోగిస్తారు. ఇండియాలో ఇలాంటి కెమెరా వాడటం ఇదే మొదటిసారి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన కెమెరా గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
Read also-November 21 movie releases: ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. రెడీగా ఉండండి మరి..
IMAX ఫార్మాట్ ప్రత్యేకత
సాధారణంగా, మన సినిమాలు సినిమాస్కోప్ ఫార్మాట్‌లో చిత్రీకరించి, ఆ తర్వాత వాటిని IMAX స్క్రీన్లకు తగినట్టుగా ‘బ్లో-అప్’ (పెద్దదిగా చేయడం) చేస్తారు. కానీ, ‘వారణాసి’ విషయంలో రాజమౌళి ఒక అరుదైన అత్యంత ప్రీమియం ఫార్మాట్‌ను ఎంచుకున్నారు అది 1.43:1 ఆస్పెక్ట్ రేషియో ఫార్మెట్. ఇది నిజమైన IMAX. దీనిని క్రిస్టోఫర్ నోలన్ వంటి ప్రపంచ దర్శకులు మాత్రమే ఉపయోగించే నిజమైన IMAX అనుభవం. ఈ 1.43:1 నిష్పత్తి అనేది సినిమా స్క్రీన్‌పై మరింత నిలువు ఫ్రేమ్‌ను అందిస్తుంది. ఇలాంటి కెమెరాతో షూట్ చేయడం వలన భారీ నిర్మాణాలు, ఎత్తైన ప్రకృతి దృశ్యాలు, పోరాట సన్నివేశాల పూర్తి వైభవాన్ని స్క్రీన్‌పై నింపడానికి ఈ నిష్పత్తి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ 1.90:1 డిజిటల్ IMAX కంటే కూడా అదనపు దృశ్య వివరాలను ఇస్తుంది. ఈ ఫార్మాట్‌ను చిత్రీకరించడానికి, రాజమౌళి బృందం ప్రత్యేకంగా IMAX-సర్టిఫైడ్ డిజిటల్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ కెమెరాలు అత్యంత అసాధారణమైన క్లారిటీతో, దాదాపు 18K రిజల్యూషన్‌కు సమానమైన వివరాలను అందిస్తాయి.
Read also-Divya Bharathi: ‘గోట్’ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. సుడిగాలి సుధీర్ ఏం చేశాడంటే?
రాజమౌళి ఎందుకు ఎంచుకున్నారు?
‘వారణాసి’ని ఒక “ప్రీమియం లార్జ్-స్కేల్ ఫార్మాట్” కోసం చిత్రీకరిస్తున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇది కేవలం పెద్ద సినిమా తీయడం మాత్రమే కాదు. భారతీయ ప్రేక్షకులకు పూర్తి స్థాయి, అత్యుత్తమ దృశ్యానుభవాన్ని అందించాలనే ఆయన లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఈ సాంకేతికతతో, సినిమా ప్రతి సన్నివేశం, ముఖ్యంగా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉండే సన్నివేశాలు, మరింత శక్తివంతంగా వాస్తవికంగా కనిపిస్తాయి. ఈ ఫార్మాట్ గొప్పదైనప్పటికీ, భారతదేశంలో 1.43:1 ప్రొజెక్షన్ సౌకర్యం ఉన్న వాణిజ్య IMAX స్క్రీన్లు ప్రస్తుతం లేవు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ, ‘వారణాసి’ విడుదలయ్యే నాటికి కనీసం ఒక్క 1.43 IMAX స్క్రీన్ అయినా హైదరాబాద్‌లో ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో IMAX స్క్రీన్ల ఏర్పాటుకు ఒక కొత్త డిమాండ్‌ను సృష్టించింది. ‘వారణాసి’ కేవలం ఒక సినిమా కాదు, భారతీయ సినిమా సాంకేతికతలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. అత్యుత్తమ నాణ్యత గల కెమెరాతో తీయబడిన ఈ సినిమా, ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించడం ఖాయం.
