Bandi Sanjay: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవుల్లో నక్సలైట్లు చనిపోతుంటే, వారికి ప్రేరణనిస్తున్న అర్బన్ నక్సలైట్లు మాత్రం ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవులు అనుభవిస్తూ, ఆస్తులు కూడగట్టుకుంటున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను నక్సలైట్లుగా మార్చి వారి మరణాలకు కారణమైన అర్బన్ నక్సల్సే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్(Karimanagaer) పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్‍కు వచ్చిన సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు ఎందుకు?
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని చెప్పుకునే అర్బన్ నక్సల్స్, ప్రస్తుతం కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఎందుకు అనుభవిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయకపోయినా, అర్బన్ నక్సల్స్ విమర్శించకపోవడం వారి స్వార్థ ప్రయోజనాలకు నిదర్శనమన్నారు. “అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని గతంలో చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను,” అని స్పష్టం చేశారు.
Also Read: Manya Anand: ధనుష్ మేనేజర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నటి మన్యా ఆనంద్?
మావోయిస్టులకు విజ్ఞప్తి – మార్చి నాటికి అంతం:
అడవుల్లోని మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మోసపోవద్దని, వారు పదవులు అనుభవిస్తున్నారని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) హామీ మేరకు, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. మావోయిస్టులంతా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. తుపాకులు వదిలి మావోయిస్టులే లొంగిపోతుంటే, అర్బన్ నక్సల్స్ ‘తుపాకులు పట్టండి’ అని రెచ్చగొట్టడం సమర్థనీయం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోడీ(Modhi) ప్రభుత్వం భారత్‌ను ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిందని కూడా ఆయన తెలియజేశారు.
Also Read: Tamil Nadu Crime: తమిళనాడులో ఘోర విషాదం.. లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేయడంతో అమ్మాయిపై కత్తితో దాడి
