Supreme Court: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మౌఖిక వాదనలు విననున్నారు. అందుకు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 19న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్‌రావు, డాక్టర్ ఎం. సంజయ్‌తో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, జి. జగదీశ్‌రెడ్డి మౌఖిక వాదనలను స్పీకర్ వింటారు. 20న ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy), అరికెపూడి గాంధీ(Arikepudi Gandhi)తో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి(Jagadesh Reddy), కల్వకుంట్ల సంజయ్(Sanjay) తరపు న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు.
విచారణ ముగింపు దశ
నలుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలపై అనర్హత పిటిషన్లపై రెండు విడతల్లో స్పీకర్ విచారణ చేశారు. ప్రతివాదులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విచారణ ముగింపు దశకు చేరడంతో ఇరుపక్షాల తరపున న్యాయవాదులు స్పీకర్ ట్రైబ్యునల్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఈ వాదనలు ముగిసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశమున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇవ్వడం, వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొన్నది. 10మంది పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read: Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి హేమ తల్లి మృతి.. సంతాపం తెలిపిన ‘మా’ సభ్యులు..
రెండు విడతల్లో..
ఇందులో తొలి విడతలో ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ ట్రైబ్యునల్ విచారించింది. రెండో విడతలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, డాక్టర్ ఎం. సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో రెండు విడతల్లో మొత్తం ఎనిమిది మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ట్రైబ్యునల్ ఎదుట విచారణకు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పందించలేదు. వారు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది.
Also Read: Minister Adluri Laxman: చిన్న చిన్న సరదాలే జీవితాన్ని నాశనం చేస్తాయి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
