madhavi-katha(x)
ఎంటర్‌టైన్మెంట్

Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..

Konda Madhavi Latha: ప్రముఖ బీజేపీ నాయకురాలు కొండా మాధవీలత, ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజమౌళి ‘దేవుడిని నమ్మను’ అని చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందిస్తూ, యువతపై ఆయన మాటల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ట్వీట్‌లో మాధవీలత కేవలం వ్యక్తిగత అభిప్రాయాన్ని కాకుండా, ఒక బాధ్యతాయుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆమె రాజమౌళిని “నా ప్రియమైన సోదరుడు” అని ఆప్యాయంగా సంబోధిస్తూనే, ఆయన కోట్ల మందికి స్ఫూర్తి అని కొనియాడారు. అయితే, “మీ అంతటి గొప్ప వ్యక్తి ‘నాకు దేవుడిపై నమ్మకం లేదు’ అని చెప్పినప్పుడు, అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు. అసంఖ్యాకమైన యువ మనస్సులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుంది” అని ఆమె స్పష్టం చేశారు. ఒక ప్రజాభిమానం పొందిన వ్యక్తి మాటలు సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఆమె ఈ మాటల ద్వారా వివరించారు.

Read also-Tamil dubbed movies: ఒరిజినల్ కంటే తెలుగులో హిట్ అయిన డబ్బింగ్ సినిమాలు ఏంటో తెలుసుకుందామా..

మాధవీలత తన ట్వీట్‌లో ముఖ్యంగా మూడు కీలక అంశాలను బలంగా నొక్కి చెప్పారు. అవి ఏంటంటే.. దేవుడిపై లేదా తమ మూలాలపై విశ్వాసం ఉంచడం అనేది బలహీనతకు సంకేతం కాదని ఆమె పేర్కొన్నారు. వినయంగా ఉండటం అనేది ఈ రోజుల్లో అవసరం లేని విషయంగా కొట్టిపారేయకూడదని, అది ఇప్పటికీ విలువైన లక్షణమేనని గుర్తు చేశారు. సినిమాటిక్ స్వేచ్ఛ పేరుతో లేదా ఆధునికత పేరుతో మన మూలాలను, సాంస్కృతిక విలువలను అగౌరవపరచడం అనేది సృజనాత్మకత కాబోదని ఆమె స్పష్టం చేశారు. చివరిగా, ఆమె రాజమౌళికి చాలా సున్నితమైన, కీలకమైన విషయాన్ని గుర్తు చేశారు. “విజయం అనేది వివేకాన్ని, జ్ఞానాన్ని బలోపేతం చేయాలి, కానీ మన విలువలను పలచన చేయకూడదు. దయచేసి బాధ్యతాయుతంగా మాట్లాడండి.. ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తున్నారు,” అని మాధవీలత విజ్ఞప్తి చేశారు.

Read also-Hyper Aadi: సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి హైపర్ ఆది స్వీట్ వార్నింగ్.. ముందు ఇది పోవాలి..

రాజమౌళి లాంటి గ్లోబల్ ఫిగర్‌కి, మాధవీలత లాంటి రాజకీయ నాయకురాలి నుండి ఇలాంటి బహిరంగా వీడియో ద్వారా చెప్పడం అనేది సమాజంలో విలువలు, విశ్వాసం ప్రజాదరణ పొందిన వ్యక్తుల బాధ్యత వంటి విషయాలపై మరింత లోతైన చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఈ ట్వీట్ రాజమౌళిపై వ్యక్తిగత దాడి కాకుండా, ఒక కళాకారుడు తన మాటల ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలనే దానిపై చేసిన ఒక విజ్ఞప్తిగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పలువురు హిందూ సంఘ నాయకులు, హిందుత్వ వాదులు ఆయన అన్న మాటలను మరింత లోతుగా తీసుకుని రాజమౌళిపై ఫైర్ అవుతున్నారు. అయితే రాను రాను ఈ కేసు కాంప్టికేట్ అవుతుంది. దీనికి సంబంధించి కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

 

Just In

01

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. 40 కిలోల బస్తాకు 1.2 కేజీల అదనపు తూకం

Nayanthara Gift: నయనతార పుట్టినరోజుకు విఘ్నేష్ ఇచ్చిన గిఫ్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?.. వర్తు మామా వర్తు..

Australia: ఒళ్లుగగుర్పొడిచే కాలం.. ఎక్కడ చూసినా లక్షల్లో స్పైడర్లు.. వణుకుపుట్టాల్సిందే!

Banakacherla Project: బనకచర్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించొద్దు.. మంత్రి ఉత్తమ్ డిమాండ్

Aishwarya Rai: ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్.. ఎందుకంటే?