Hyderabad IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్స్ అయిన పిస్తా హౌస్ (Pistha House), షా గౌస్ (SHAH GHOUSE), మేఫిల్ (MEHFIL) హోటళ్లలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. సంబంధిత హోటళ్లు, కార్యాలయాలు, బ్రాంచ్ లు, యజమానుల ఇళ్లల్లో ఒక్కసారిగా దాడి చేసిన అధికారులు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను (Hyderabad IT Raids) పరిశీలించారు. 50 మందికి పైగా బృందాలు.. 30 ప్రదేశాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించడం గమనార్హం.
హైదరాబాద్ బిర్యానీకి ఎంతో పాపులరైన పిస్తా హౌస్, షా గౌస్, మే ఫిల్ రెస్టారెంట్లలో నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది. 1997లో మెుహమ్మద్ అబ్దుల్ మజీద్ స్థాపించిన పిస్తా హౌస్.. భారత్ లోనే కాకుండా అమెరికా, ఒమన్, దుబాయ్, కొవైట్ వంటి దేశాలకు సైతం విస్తరించింది. అలాగే షాగౌస్ సైతం గచ్చిబౌలి నుంచి ఓల్డ్ సిటీ వరకూ విస్తరించి.. పెద్ద ఎత్తున ఫుడ్ బిజినెస్ చేస్తోంది. అలాగే మేఫిల్ కూడా నగరంలో పలు బ్రాంచ్ లను నిర్వహిస్తూ నిత్యం రద్దీగా దర్శనమిస్తుంటుంది. అయితే ఈ రెస్టారెంట్లు అర్జిస్తున్న ఆదాయానికి.. చెల్లిస్తున్న పన్నులకు ఎలాంటి సంబంధం ఉండటం లేదని సమాచారం.
Read Also- Harish Rao: రైతుల కన్నీళ్లు పట్టట్లేదా.. పంట బీమా ఎక్కడ.. సీఎంపై హరీశ్ రావు ఫైర్
పిస్తా హౌస్, షాగౌస్, మేఫిల్ రెస్టారెంట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో మంగళవారం ఏకకాలంలో ఆయా రెస్టారెంట్ల బ్రాంచ్ లు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏటా వందల కోట్ల టర్నోవర్ కలిగిన ఈ హోటల్స్.. తమ రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన రాబడికి మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హవాలా లావాదేవీలు, నికిలీ బిల్లులు, అనుమానస్పద లావాదేవీలు తదితర ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆయా హోటల్స్ కు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను సైతం అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.కోట్లల్లో హవాలా సొమ్ము బయటపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. హోటల్స్ లో సోదాలకు సంబంధించి ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also- Ginning Mills Srike: ఎక్కడికక్కడ జిన్నింగ్ మిల్లుల మూత.. తీవ్ర ఆందోళనలో పత్తిరైతులు
