Saudi Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్‌యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 45మంది సజీవ దహనమయ్యారు. మృతులందరూ హైదరాబాదీలు కావడంతో నగరంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రతి ఏటా పవిత్ర మక్కా.. మదీనా యాత్రకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు తమ తమ పిల్లలతో కలిసి వెళ్తారన్న విషయం తెలిసిందే. ఇలాగే నవంబర్9న విద్యానగర్, బజార్‌ఘాట్, మల్లేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 54 మంది ఆల్ మక్కా, బాబ్ ఉల్హర్మైన్, హప్సా, మహమూద్ భాయ్‌జాన్ ట్రావెల్స్నుంచి మక్కా యాత్రకు బయల్దేరి వెళ్లారు. వీరిలో 28 మంది మహిళలు, 17 మంది పురుషులతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. తొలుత జెడ్డాకు చేరుకున్న యాత్రికుల బృందం ఆ తరువాత మక్కా వెళ్లింది. అక్కడ ప్రార్థనలు ముగించుకున్న అనంతరం నలుగురు మక్కాలోనే ఉండిపోగా మరో నలుగురు కారులో, మిగిలిన 46 మంది బస్సులో మదీనాకు పయనమయ్యారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫరహత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1:30గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్బస్సును ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఉన్న యాత్రికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ప్రమాదంలో ట్యాంకర్‌లోని డీజిల్ లీక్‌కావడం, నిప్పు రవ్వలు అంటుకుని క్షణాల్లోనే అగ్నికీలలు బస్సును కబళించేయడంతో 46 మంది యాత్రికుల్లో షోయాబ్అనే వ్యక్తి మినహా మిగితా వారంతా సజీవ దహనమయ్యారు.
కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నం..
ఈ ప్రమాదంలో విద్యానగర్‌కు చెందిన ఓ కుటుంబంలోని 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ కుటుంబంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు. విద్యానగర్ నివాసి నసీరుద్దీన్ రైల్వేలో పని చేసి రిటైరయ్యారు. మక్కా మదీనా యాత్రకు తన కుమారులు, కూతుళ్లు, కోడళ్లు, వారి పిల్లలతో సహా మొత్తం 18 మందితో కలిసి ప్రయాణమయ్యారు. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఎగిసిన మంటల్లో ఈ కుటుంబానికి చెందిన నసీరుద్దీన్, ఉమ్మేజా, మరియం ఫాతిమా షేక్ జైనుద్దీన్, మెహరీష్, మహ్మద్, రిదాతజీన్, ఉజైరుద్దీన్, అక్భర్బేగం, అసిన్ ఫాతిమా, అమీనా బేగం, సారా బేగం, సబానా బేగం, సుబేషా జాఫర్, రిజ్వానా బేగం, సలావుద్దీన, ఫర్హానా సుల్తానా, తసీమా తహ్రీన్చనిపోయారు.
Also Read: Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతుల బాధితులకు నష్ట పరిహారం ప్రకటించిన సీఎం
మరో కుటుంబంలో 7 మంది..
ఇక, బజార్‌ఘాట్‌కు చెందిన మరో కుటుంబంలో 8 మంది ప్రమాదంలో కన్నుమూశారు. ఈ కుటుంబంలో ఒక్క మహ్మద్అబ్దుల్షోయాబ్గాయాలతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దుర్ఘటనలో షోయాబ్తండ్రి మహ్మద్అబ్దుల్ఖదీర్, తల్లి గౌసియా బేగం, మహ్మద్మౌలానా, రహీమ్ఉన్నీసా, రహమత్ బీ, మహ్మద్మన్సూర్తో పాటు మరొకరు సజీవ దహనమయ్యారు.
8 మంది మాత్రమే క్షేమం..
ప్రమాదంపై హైదరాబాద్ జాయింట్‌కమిషనర్ తఫ్సీర్ఇక్భాల్మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైనట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ షోయాబ్‌కు చికిత్స జరుగుతోందని తెలిపారు. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది తెలియ రాలేదని చెప్పారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీ నుంచి సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మక్కా యాత్రకు వెళ్లిన వారిలో 8 మంది మాత్రమే సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. యాత్రికుల్లో నలుగురు మక్కాలోనే ఉండిపోవడం.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్నారు. ప్రమాదానికి గురైన బస్సు సౌదీ రవాణ శాఖకు చెందినదని తెలిపారు.
Also Read; Ramulu Suicide Case: కేశపట్నంలో బలవన్మరణం బాధితులకు న్యాయం.. నిందితుల రిమాండ్..!
