Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్స్ లో నామినేషన్స్ రోజు మాత్రం చాలా మంది చూస్తారు. అలాగే, ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే, 10 వారాల పాటు ఫ్యామిలీ దూరంగా ఉండి, సడెన్ గా వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే.. ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు కదా. వారితో పాటు చూసే ప్రేక్షకులకు కూడా ఎమోషనల్ అవుతారు. అందుకే ఈ వీక్ అందరికీ అంత ఫేవరేట్ గా మారింది.
బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ వారం తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. ఫ్యామిలీస్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ మరింత సందడిగా మారబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తనూజ కుటుంబసభ్యులు హౌస్‌లోకి వచ్చిన దృశ్యాలు హైలైట్‌గా నిలిచాయి.
ముందుగా తనూజ అక్క కూతురు హౌజ్‌లోకి అడుగుపెట్టగా హౌస్ మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ చూసి ఆమె ఆనందం వ్యక్తం చేసింది. తర్వాత తనూజ చెల్లి హౌస్‌లోకి రావడంతో ఎమోషన్స్‌ను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. త్వరలోనే చెల్లి పెళ్లి ఉండటంతో ఆమె మరింత భావోద్వేగానికి లోనైంది.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రత్యేకంగా తనూజకు సర్ప్రైజ్ ఇస్తూ… హౌస్‌లోనే తన చెల్లిని పెళ్లి కూతురిలా రెడీ చేసే అవకాశాన్ని అందించారు.

