Bus-Stations (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

New Bus Stations: గ్రేటర్‌లో మూడు బస్ టర్మినల్స్
ఉప్పల్, ఆరంఘర్, ఫోర్త్ సిటీలో ఏర్పాటు
కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం
నగరంలో నలువైపులా ఉండేలా ప్లాన్
త్వరలోనే కార్యరూపం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు బస్ స్టేషన్ల ఏర్పాటుకు (New Bus Stations) సన్నద్ధమవుతోంది. జనాభాకు అనుగుణంగా నిర్మాణం చేపట్టి ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ లో మరో మూడు బస్ టెర్మినల్ (బస్ స్టేషన్ల) నిర్మాణంకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అధికారులకు సైతం అందుకు సంబంధించిన స్థల సేకరణపై ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

ప్రజలకు రవాణా సౌకర్యాల పెంపునకు ప్రభుత్వం దృష్ఠిసారించింది. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతుంది. నగరం నాలుగువైపులా బస్ స్టేషన్లు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. గ్రేటర్ లోని జేబీఎస్ మాదిరిగా అధునాతన బస్సు టర్మినల్ నిర్మించేందుకు సిద్ధమవుతుంది. మూడు టెర్మినల్ నిర్మాణం చేపట్టేందుకు సుమూఖంగా ఉంది. అందుకోసం భూసేకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. అదే విధంగా ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ, పోలీసు శాఖలకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ లో కూడా బస్ టర్మినల్ నిర్మానానికి అధ్యయనం చేయాలని సూచించింది. రోజూరోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ టెర్మినల్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో నివేదికను అందించాలని రవాణాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల నుంచి నివేదిక అందగానే బస్సు డిపోల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి.

నష్టాల్లోని డిపోలపై ఫోకస్

తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్ సుఖ్ నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథాని డిపోలతో పాటు పలు డిపో లు నష్టాల ఊబీలో కూరుకుపోయాయి. నష్టాలకు గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయనున్నారు. ఈ కమిటీలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, డిపో మేజర్ తోపాటు డ్రైవర్, కండాక్టర్ లకు సైతం అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనేది స్పష్టత రానుంది. హయర్ బస్సులతో నష్టం వాటిల్లిందా లేకుండా మరే ఇతర కారణాలు అనేది కూడా వెల్లడికానుంది. అంతేగాకుండా ఏసీ బస్సులకు ప్రజల ఆధరణ ఎలా ఉంది.. వాటితో ఏమైన నష్టాలు వచ్చాయా? తదితర వివరాలను సైతం అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

ఇద్దరు డ్రైవర్లు

ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పని తీరును మెరుగుపర్చనున్నారు. డ్రైవర్ మానిటరింగ్ సిస్టం డ్రైవర్ నిద్రకు ఉపక్రమించే సమయంలో సూచనలు చేస్తుంది. మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ లకు నిరంతరం శిక్షణ ఇచ్చి.. ప్రతి బస్సుకి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయబోతున్నారు. అంతేగాకుండా డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

సీఎం ఆలోచనలకు అనుగుణంగా బస్ టెర్మినల్: మంత్రి పొన్నం ప్రభాకర్

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించాం. నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేయడం జరుగుతుంది. నగరంలో నలువైపుల బస్ స్టేషన్ లు ఉండేలా జేబిఎస్ మాదిరిగా ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించనున్నాం. ఉప్పల్ లో కూడా బస్ టర్మినల్ నిర్మించబోతున్నాం. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనిలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లలో బస్సులు నడిపించేందుకు చర్యలు చేపడుతున్నాం’’ అని మంత్రి పొన్న ప్రభాకర్ వివరించారు.

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!