globe-tuter-event(X)
ఎంటర్‌టైన్మెంట్

SSMB29 title glimpse event: ఏం డెడికేషన్ భయ్యా టైటిల్ గ్లింప్స్ కోసం లెక్చరర్ గా మారిన రాజమౌళి.. వీడియో వైరల్..

SSMB29 title glimpse event: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘SSMB 29’ టైటిల్ గ్లింప్స్ కోసం ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడో తెలిసిందే. సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తున్నారో అన్న వీడియోను సుమ కనకాల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాజాగా దీనిని సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఃనవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్న భారీ ఈవెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ ఏర్పాట్లు, నిబంధనలపై రాజమౌళి స్వయంగా విడుదల చేసిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే, ప్రముఖ యాంకర్ సుమ కనకాల షేర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read also-Pushpa 3: అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

రాజమౌళి ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌ను కేవలం ఒక ప్రెస్ మీట్‌లా కాకుండా, తన సినిమా స్క్రిప్ట్ సిట్టింగ్స్ లాగే పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ హోస్టింగ్‌ను సుమ కనకాల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ చేపట్టనున్నారు. సుమ కనకాల తాజాగా షేర్ చేసిన వీడియోలో, దర్శకుడు రాజమౌళి తన హోస్టింగ్ టీమ్‌ను (సుమ ఆశిష్ చంచ్లానీతో సహా) ఒకే చోట కూర్చోబెట్టి, ఈవెంట్ తీరుతెన్నులు, ప్రెజెంటేషన్ వివరాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో, రాజమౌళి తన ఈవెంట్‌ను ఎంత సీరియస్‌గా వివరంగా ప్లాన్ చేస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక భారీ సినిమా కథా చర్చల్లాగే ఈవెంట్ ప్రెజెంటేషన్‌ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరలో కీరవాణి కనిపించిన తీరు అందరినీ నవ్విస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ అయ్యో చంపేస్తున్నాడుగా పని రాక్షసుడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Globe Trotter event: ‘SSMB29’ ఈవెంట్ లోకేషన్ డ్రోన్ విజువల్ చూశారా.. పిచ్చెక్కుతుంది భయ్యా..

ఈవెంట్ హోస్ట్‌లుగా ఉన్న సుమ కనకాల, ఆశిష్ చంచ్లానీలకు రాజమౌళి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయడం, ఈ కార్యక్రమానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో, రాజమౌళి ఇప్పటికే పలు వీడియోల ద్వారా అభిమానులకు నిబంధనలు భద్రతా సూచనలు జారీ చేశారు. సుమ కనకాల ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై ఉన్న ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ భారీ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌కి రికార్డు ధరకు విక్రయించినట్లు కూడా సమాచారం.

Just In

01

Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?

Severe Cold Wave: హైదరాబాదీలకు వణుకుపుట్టించే అప్‌డేట్ ఇదీ.. రాబోయే 6 రోజులు తట్టుకోలేరు!

DGP Shivadhar Reddy: నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : డీజీపీ శివధర్ రెడ్డి

Auto Driver Theft: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆటో డ్రైవర్ సాయం.. కానీ రూ.10 లక్షలతో పరారీ

Bihar Election Results: ఇదేం ట్విస్ట్!.. బీహార్‌లో బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ