JetLee movie: టాలీవుడ్‌లో తనదైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ సత్య కథానాయకుడిగా రాబోతున్న సినిమా టైటిల్ విడుదలైంది. ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ ‘జెట్లీ’ పోస్టర్ను ను విడుదల చేశారు నిర్మాతలు. ఓ సరికొత్త చిత్రం రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్టర్ రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనగానే, సత్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘మత్తు వదలరా’ గుర్తుకు రాకమానదు. అదే టీమ్ నుండి వస్తున్న ఈ కొత్త సినిమాపై సినీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. సత్య, రితేష్ రానా కలయికలో ఇప్పటికే వచ్చిన ‘మత్తు వదలరా’ (2019), ‘మత్తు వదలరా 2’ (2024) సినిమాలు క్రైమ్ కామెడీ జానర్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ సినిమాల్లో సత్య పోషించిన కీలక పాత్రలు, ముఖ్యంగా అతని అమాయకత్వం, కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తొలిసారిగా సత్యను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేస్తూ, రితేష్ రానా తనదైన మార్క్ వినోదం, ఊహించని మలుపులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
Read also-Guddi Maruti: ‘ఖిలాడి’లో అక్షయ్ కుమార్‌తో చేసిన కిస్సింగ్ సీన్ గుర్తుచేసుకున్న నటి
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుండటం విశేషం. ఈ నిర్మాణ విలువలే సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియాగా గుర్తింపు పొందిన రియా సింఘా ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది. అలాగే, కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరితో సత్య కాంబినేషన్ తెరపై మరింత వినోదాన్ని పంచుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read also-Kaantha Review: కాంతా మూవీ రివ్యూ.. భయాన్ని జయించి నిజం కోసం నిలిచిన కథ
ఈ చిత్రానికి సంగీతాన్ని కాలభైరవ అందిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సిరీస్‌కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన కాలభైరవ, ఈ చిత్రానికి కూడా తనదైన శైలిలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ ట్యూన్స్‌ను అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సురేశ్ సారంగం పనిచేయనున్నారు. ఒక కమెడియన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు సోలో హీరోగా మారుతున్న సత్యకు ఈ సినిమా ఒక ముఖ్యమైన ఘట్టం. రితేష్ రానా ప్రత్యేకమైన కథ, కథనం, సత్య కామెడీ టైమింగ్‌తో కలిసి, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక వికృతమైన, చమత్కారమైన ప్రయాణంగా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తుంటే.. సత్య మరో సారి తనదైన కామెడీతో అలరించబోతున్నడని తెలుస్తోంది. టైటిల్ కూడా ‘జెట్లీ’ అనిపెట్టి జెట్ పై ఉన్న బ్రూస్లీలా పోజ్ ఇచ్చాడు. ఇది చూసిన ప్రేక్షకులు టైటిల్ తోనే నవ్విస్తున్నాడని అంటున్నారు.
̶C̶o̶m̶e̶d̶i̶a̶n̶ ̶S̶a̶t̶y̶a̶ ̶ HERO #Satya in and not as #JETLEE ❤🔥
A @RiteshRana's turbulence 🛫
Entertainment takes off. Shoot begins 💥💥
Starring #Satya, #RheaSingha, @vennelakishore
Music by @kaalabhairava7
Produced by @ClapEntrtmnt
Presented… pic.twitter.com/X99IRAAEVt— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2025
