Election Celebrations: జూబ్లీహిల్స్ లో ఎన్నికల ఫలితాలు తర్వాత గ్రౌండ్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు పార్టీ రెడీ అయింది. ఇప్పటికే ముఖ్య నాయకులు, పీసీసీ కమిటీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. విజయం తర్వాత హైదరాబాద్(Hyderabada) మొత్తం మార్మోగిపోవాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ సూచించింది. ర్యాలీలు, సక్సెస్ మీట్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నది. జూబ్లీహిల్స్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సంబురాలు జరిగేలా ప్లాన్ చేయాలని ముఖ్య నాయకులకు పార్టీ సూచించింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ని సెలబ్రేషన్స్ మానిటరింగ్ బాధ్యతలు ఖైరతాబాద్(Khairatabad), సికింద్రాబాద్(Secunderabad) డీసీసీ(ధఢఢ)లు అప్పగించింది. ఈ ఫలితం ద్వారా తర్వాతి ఎన్నికలపై ప్రభావం పడేలా సంబురాలు జరగాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అభిప్రాయ పడుతున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి విజయం సాధించడం తథ్యమని కాంగ్రెస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. పోలింగ్ సరళి, అంతర్గత సర్వేల ఆధారంగా ఈ నియోజకవర్గంలో తమకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని అంచనా వేస్తున్నాయి. ఈ నమ్మకంతోనే, పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తూ ‘గెట్ రెడీ ఫర్ సెలబ్రేషన్స్’ అంటూ డీసీసీ ద్వారా ఆదేశాలు పంపారు.
విజయ సంకేతాలు వ్యాప్తి..
విజయం ఖరారైన వెంటనే హైదరాబాద్ నగరం అంతటా హాడావిడి సృష్టించాలని కాంగ్రెస్(Congress) పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. విజేతను అభినందిస్తూ భారీ స్థాయిలో విజయ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీలను విజయవంతం చేయాలని కోరారు.అంతేగాక నియోజకవర్గ స్థాయిలో, అలాగే డీసీసీల ఆధ్వర్యంలో ‘సక్సెస్ మీట్‌లు’ నిర్వహించి, ఎన్నికల విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించాలని తీర్మానించారు. దీంతో పాటు విజయం అందిన వెంటనే పటాకులు కాల్చి, స్వీట్లు పంచుతూ వేడుకలు జరపాలని కార్యకర్తలకు సూచించారు.ఈ వేడుకలను పర్యవేక్షించేందుకు మరియు సమన్వయం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డీసీసీలు, ముఖ్యనాయకులు బాధ్యతలు తీసుకోనున్నారు. ఫలితం వెలువడగానే వెంటనే తమ శ్రేణులను అప్రమత్తం చేసి, ప్రణాళికాబద్ధంగా వేడుకలను ప్రారంభించేలా చూడాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, నియమ నిబంధనలకు లోబడి వేడుకలు జరగాలని పీసీసీ ఆదేశాలిచ్చారు.
Also Read: Gold Price Today: మహిళలకు బిగ్ షాక్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?
45 శాతం ఓట్లకు మించి..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు అన్ని సర్వే సంస్థలు 45 శాతానికి మించి ఓట్లు వస్తాయని తమ అంచనా రిపోర్టులో పేర్కొన్నాయి. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు మధ్య దాదాపు 6 నుంచి 8 శాతం ఓట్ల తేడా ఉండోచ్చనే అభిప్రాయాన్ని సర్వేల్లో వెల్లడించారు. దీంతో పాటు నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇన్ చార్జ్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ కమిటీలు కూడా గెలుపుపై స్పష్టమైన ధీమాను వ్యక్తం చేశాయి. దీంతో పాటు నియోజకవర్గంలో ముందస్తుగానే కొందరు క్షేత్రస్థాయి లీడర్లు సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ విజయానికి ముందుగానే సంకేతాలని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ శ్రేణులు కష్టం, ప్రభుత్వ పనితీరు, అభ్యర్ధి ఇమేజ్ వంటివన్నీ కాంగ్రెస్ విజయానికి కృషి చేశాయని భావిస్తున్న పీసీసీ..మధ్యాహ్నం వరకు విజయం ట్రెండ్ తేలిపోతుందని వివరిస్తున్నారు.
Also Read: Warangal: వరంగల్‌లో ఏడీబీ ప్రతినిధుల పర్యటన.. ముంపు ప్రాంతాలు, నాలా స్థితిగతుల పరిశీలన
