Ram-Chander-Rao (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ జరిగింది

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి
పెద్ద ఎత్తున డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారు
జూబ్లీహిల్స్‌లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం
ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించం
అనుకూలంగా ఉన్నా లేకున్నా మాది ఇదే స్టాండ్
కొన్ని గంటల్లో ఎవరెంటో తేలిపోతుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోబోమని, జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బీఆర్ఎస్ కష్టపడిందని చురకలంటించారు. కాంగ్రెస్ గెలవకపోతే బీఆర్ఎస్ నేతలు జైలుకు పోతారనే భయంతోనే కాంగ్రెస్ గెలిచేలా బీఆర్ఎస్ కృషిచేసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందని రాంచందర్ రావు తెలిపారు. బీహార్‌లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని, ఎన్డీయే కూటమి గెలవబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నా లేకున్నా తాము వాటిని విశ్వసించబోమన్నారు. విజయం వస్తే పొంగిపోము, ఓటమి చెందితే కృంగిపోమని రాంచందర్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.

Read Also- Gold Chain Theft: 4 తులాల గోల్డ్ చైన్ చోరీ.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నా లేకున్నా ఇదే తమ స్టాండ్ అని రాంచందర్ రావు చెప్పారు. కొన్ని గంటల్లో ఫలితాలు రాబోతున్నాయని, ఎవరేంటో తేలిపోతుందన్నారు. అనంతరం ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా బిర్సా ముండా శోభాయాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16న ట్యాంక్ బండ్‌పై బిర్సా ముండా జయంతి సందర్భంగా భారీ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

కాగా, శుక్రవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ (Jubilee Hills Counting) జరగనుంది. మొత్తం లక్షా 94 వేల 631 (48.49 శాతం) ఓట్లు పోల్ అవ్వగా, వాటిని లెక్కించేందుకు 42 టేబుల్స్, 10 రౌండ్లుగా లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత సాధారణ ఓట్లను లెక్కించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్ నెంబర్-1 నుంచి ఓట్ల లెక్కింపును మొదలుపెట్టనున్నట్లు సమాచారం. చివరిగా ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన ఓట్లను లెక్కించనున్నట్లు తెలిసింది.

Read Also- SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ స్టేషన్లు 407 ఉండగా, ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్-1 నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 నుంచి 42 వరక ఉన్న ఈవీఎంలను తెరిచి, ఆ తర్వాత అవే టేబుల్స్‌పై పోలింగ్ స్టేషన్ నెంబర్ 43 నుంచి పోలింగ్ స్టేషన్ నెంబర్ 85 వరకు, ఇలా రౌండ్ కు 42 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్లను లెక్కించి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లతో ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఓట్లను లెక్కించే సమయంలోని చెల్లని ఓట్లను కూడా అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు చూపి పక్కన పెట్టనున్నారు.

Just In

01

Revolver Rita Trailer: అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ.. బూతులు మాట్లాడుతున్నాడే!

Directors: ట్రెండ్ మారుతోంది.. దర్శకులే హీరోలుగా!

Koragajja: ‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’.. గూస్‌బంప్స్ తెప్పించే మరో రూటెడ్ కథ వస్తోంది!

Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు