Govinda hospitalized: బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా నిన్న రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తన జుహూ నివాసంలో మూర్ఛపోయిన తర్వాత, 61 ఏళ్ల ఈ నటుడిని హుటాహుటిన ముంబైలోని సబర్బన్ ప్రాంతంలో ఉన్న క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఆయన కుటుంబ స్నేహితుడు, న్యాయవాది అయిన లలిత్ బిందాల్ స్పష్టతనిచ్చారు. “ఆయన నిన్న సాయంత్రం మూర్ఛపోయారు, వెంటనే నాకు కాల్ చేశారు. నేను ఆలస్యం చేయకుండా ఆయన్ని క్రిటికేర్ ఆసుపత్రికి తీసుకొచ్చాను,” అని బిందాల్ తెలిపారు.
Read also-Konda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..
ప్రస్తుతం, గోవిందా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యులు ఆయనకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు” అని బిందాల్ ధృవీకరించారు. గోవిందా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా పెద్ద తెరపై అడపాదడపా కనిపిస్తున్నప్పటికీ, 90వ దశకంలో తన అద్భుతమైన డ్యాన్స్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన గోవిందాకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే, సోషల్ మీడియాలో అభిమానులు సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
గోవింద ఆసుపత్రిలో చేరడానికి ముందు రోజు నటుడు ధర్మేంద్ర అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని ఆయన్ని పరామర్శించారు. అలా జరిగిన మరుసటి రోజే గోవింద్ ఆసుపత్రిలో చేరడం గమనార్హం. ధర్మేంద్రను పరామర్శించిన తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు గోవింద ముఖంలో ఆందోళన కనిపించింది. అదే స్థితినుంచి ఇంటికి వచ్చేశారు. కొన్ని గంటల తర్వాత ఇంట్లోనే మూర్ఛ పోవడం.. అనంతరం ఆసుపత్రిలో చేరడం అన్నీ జరిగింది. విషయం తెలుసుకున్న గోవింద్ అభిమానులు ఆయన వీలైనంత తొందరగా కోలుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. మరిన్ని విషయాల కోసం ఆగాల్సిందే.
