Dharmendra health update: బాలీవుడ్ సీనియర్ నటుడు, సినీ దిగ్గజం ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులకు శ్రేయోభిలాషులకు ఉపశమనం కలిగించే వార్త విడుదలైంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స అనంతరం తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు చికిత్స అందించిన బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ధర్మేంద్ర ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు, తదుపరి చికిత్స పర్యవేక్షణను ఇంటి వద్దే కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Read also-The RajaSaab: ‘ది రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్.. ప్రభాస్ ఎం ఉన్నాడు మామా..
ఆసుపత్రిలో చేరిక
గతంలో ధర్మేంద్ర శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో ఆయనను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ వర్గాల్లో, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక దశలో ఆయన ఆరోగ్యంపై అవాస్తవ పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే, ధర్మేంద్ర కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య హేమ మాలిని పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఆ పుకార్లను ఖండించారు. సీనియర్ నటుడు చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని భరోసా ఇచ్చారు.
Read also-Nagarjuna: వారికి కూడా ఆ సత్తా లేదంటున్న కింగ్ నాగార్జున.. ఎందుకంటే?
ఇంటికి పయనం
ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ధర్మేంద్ర కుమారులు, కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు ఆయన పక్కనే ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. వైద్యుల చికిత్స కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో ధర్మేంద్ర త్వరగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండకుండా, ఆయనను ఇంటికి తీసుకెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో సంపూర్ణ విశ్రాంతిని కల్పించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వారి అభ్యర్థన మేరకు, వైద్యులు ధర్మేంద్రను బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ధర్మేంద్ర ఇంటికి చేరుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత విశ్రాంతి అవసరం. ఈ క్లిష్ట సమయంలో అభిమానులు చూపిన ప్రేమ, మద్దతుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం తమకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరారు. “ధర్మేంద్రను ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆయనను డిశ్చార్జ్ చేశాము. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది” అని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని డాక్టర్లు వెల్లడించారు.
